📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Telugu News: Nicolas Maduro- కరేబియన్‌లో ఉద్రిక్తతలు: వెనుజువెలాపై అమెరికా సైనిక చర్య భయం

Author Icon By Pooja
Updated: September 7, 2025 • 5:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nicolas Maduro: కరేబియన్ సముద్రంలో(Caribbean Sea) ఒక్కసారిగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రపంచంలోనే అత్యధిక చమురు వనరులు కలిగిన వెనుజువెలా చుట్టూ అమెరికా భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించింది. ఆధునిక యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్లు, ఫైటర్ జెట్‌లతో ఆ దేశాన్ని చుట్టుముట్టడంతో ఎప్పుడైనా దాడి జరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏడు యుద్ధాలను ఆపానని చెప్పుకొనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు వెనుజువెలాపై దృష్టి సారించడం చర్చనీయాంశమైంది.

వెనుజువెలా చుట్టూ అమెరికా భారీ సైనిక మోహరింపు

అమెరికా ప్రకటన ప్రకారం, వెనుజువెలా నుంచి డ్రగ్స్ ముఠాలు తమ దేశంలోకి ప్రవేశిస్తున్నాయని, వాటిని అరికట్టడమే ఈ సైనిక చర్య లక్ష్యమని పేర్కొంది. మదకద్రవ్యాల రవాణాలో వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోకూ సంబంధాలున్నాయని ఆరోపిస్తూ, ఆయన ఆచూకీ తెలిపిన వారికి 50 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించింది. ఇటీవల ట్రంప్ మదురో ప్రభుత్వానికి రోజులు లెక్కపట్టాయని హెచ్చరించడమే ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

అయితే అంతర్జాతీయ విశ్లేషకులు మాత్రం అమెరికా వాదనలను ఖండిస్తున్నారు. డ్రగ్స్ మాఫియాపై పోరాటం కాదని, వెనుజువెలాలోని అపారమైన చమురు నిల్వలపై నియంత్రణ సాధించడమే అసలు ఉద్దేశమని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతతో వెనుజువెలా కుదేలైపోయిన ఈ సమయంలో అమెరికా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సైనిక శక్తిని ప్రదర్శించి ప్రత్యర్థులను బెదిరించే “గన్‌బోట్ డిప్లమసీ”(Gunboat Diplomacy) ట్రంప్‌కి కొత్తది కాదని, అయితే ఈసారి ప్రత్యక్ష సైనిక చర్యకు దిగడం ఆందోళన కలిగిస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న ప్రపంచ దేశాలు అమెరికా ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నాయి. ఉద్రిక్తతలు కొనసాగితే కరేబియన్ ప్రాంతంలో తీవ్రమైన పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

అమెరికా వెనుజువెలా చుట్టూ సైన్యం ఎందుకు మోహరించింది?

అమెరికా ప్రకారం, వెనుజువెలా నుంచి డ్రగ్స్ ముఠాలు తమ దేశంలోకి ప్రవేశిస్తున్నాయని, వాటిని అరికట్టడమే ప్రధాన ఉద్దేశమని తెలిపింది.

వెనుజువెలా అధ్యక్షుడు మదురోపై ఆరోపణలు ఏమిటి?
ఆయనకు డ్రగ్స్ మాఫియాతో ప్రత్యక్ష సంబంధాలున్నాయని అమెరికా ఆరోపించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-akhilesh-yadav-is-there-a-political-conspiracy-behind/national/542881/

Breaking News in Telugu Caribbean tensions Donald Trump Venezuela Google News in Telugu Latest News in Telugu US military action US Venezuela conflict Venezuela oil crisis

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.