తమ పౌరుడికి ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం(Nobel Prize) ప్రకటిస్తే ఏ దేశమైనా సంతోషిస్తుంది. కానీ, వెనెజువెలా మాత్రం నోబెల్ కమిటీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడోను(Maria Corina Machado) నోబెల్ అవార్డుల కమిటీ ఈ ఏడాది శాంతి పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో మండిపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రతీకారంగా నార్వేలోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు వెనెజువెలా విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Read Also: Data Center: టెక్ ప్రపంచంలో ఏపీకి ఘనత: నారా లోకేష్
దౌత్య కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ
వెనెజువెలా ప్రభుత్వం అధికారికంగా నోబెల్ ప్రకటనపై స్పందించనప్పటికీ, తమకు వ్యతిరేకంగా పోరాడుతున్న మచాడోను(Machado) ఎంపిక చేయడంతో అధ్యక్షుడు మదురో ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం, దౌత్య కార్యకలాపాల అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగానే నార్వేలోని తమ రాయబార కార్యాలయాన్ని(ambassador Office) మూసివేస్తున్నట్లు వెల్లడించింది. దీనితో పాటు, జింబాబ్వే, బుర్కినా ఫాసో వంటి దేశాల్లో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకునేందుకు ఆస్ట్రేలియాలోని రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేస్తున్నట్లు పేర్కొంది.
నార్వే అసంతృప్తి, వివరణ
రాయబార కార్యాలయం మూసివేత నిర్ణయంపై నార్వే విదేశాంగ మంత్రిత్వ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. అనేక విషయాల్లో తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, వెనెజువెలాతో(Venezuela) తాము చర్చలు కోరుకుంటున్నామని తెలిపింది. నోబెల్ బహుమతి ప్రకటనలలో నార్వే ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం ఉండదని, నార్వేజియన్ నోబెల్ కమిటీ స్వతంత్రంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుందని నార్వే వివరణ ఇచ్చింది.
నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపికైన వెనెజువెలా ప్రతిపక్ష నేత ఎవరు?
మరియా కొరీనా మచాడో.
నోబెల్ నిర్ణయంపై వెనెజువెలా తీసుకున్న ప్రతీకార చర్య ఏమిటి?
నార్వేలోని తమ దేశ రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: