📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Telugu News: Lindsey Graham- రష్యాకు మద్దతుపై భారత్ కు  అమెరికా సెనేటర్ వార్నింగ్

Author Icon By Pooja
Updated: August 29, 2025 • 4:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Lindsey Graham: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఏకంగా నియంతలా పాలిస్తున్నారు. తన సిద్ధాంతాలే కరెక్టు అనుకుని, ప్రజల క్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, అమెరికాను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారు. అధిక టారిఫ్లను విధిస్తూ, దేశాలమధ్య చిచ్చురేపుతున్నారు. తన నిబంధనలకు తలొగ్గని దేశాలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. తాజాగా భారత్ను ట్రంప్ ప్రభుత్వం(Trump administration) మరోసారి హెచ్చరించింది.

భారతైపై విరుచుకుపడ్డ అమెరికా సెనేటర్

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అమెరికా రిపబ్లికన్ పార్టీకి చెందిన సీనియర్ సెనేటర్ లిండ్సే గ్రాహం(Senator Lindsey Graham) మరోసారి విమర్శలు చేశారు. ఈ దేశాల చర్యల వల్లే ఉక్రెయిన్లో రష్యా యుద్ధ యంత్రాంగం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మద్దతు ఇస్తున్నందుకు భారత్ ఇప్పటికే మూల్యం చెల్లించుకుంటోందని, ఇతర దేశాలకు కూడా త్వరలోనే ఇదే గతి పడుతుందని గట్టిగా వాచ్చరించారు.

రష్యా దాడిలో 23మంది ఉక్రెయిన్ పౌరులు మృతి

గురువారం ఉక్రెయిన్ లోని కీవ్ నగరంపై రష్యా జరిపిన భీకర దాడిలో 23 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే లిండ్సే గ్రాహం సామాజిక మాధ్యమం ‘ఏక్స్ వేదికగా స్పందించారు. ‘రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ పుతిన్ యుద్ధానికి ఊతమిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలకు ఇప్పుడెలా అనిపిస్తోంది? మీ కొనుగోళ్ల వల్లే పిల్లలతో సహా అమాయక పౌరులుప్రాణాలు కోల్పోతున్నారు. పుతిన్కు మద్దతిచ్చినందుకు భారత్ ఇప్పటికే మూల్యం చెల్లిస్తోంది. మిగతా దేశాలకు కూడా త్వరలోనే ఇదే గతి పడుతుంది’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. లిండ్సే గ్రాహం చాలాకాలంగా రష్యా చమురు ఆదాయంపై విమర్శలు చేస్తున్నారు. ‘చమురు, గ్యాస్ ఆదాయం లేకపోతే రష్యా కుప్పకూలిపోతుంది. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దాని వినియోగదారులను దెబ్బతీయడమే మా ప్రధాన లక్ష్యం’ అని ఆయన గతంలో ఎన్బీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ట్రంప్ తన మాట వినడం లేదని ఏకంగా భారత్పై 50శాతం సుంకాలను విధించాడు. భారత్ మాత్రం ట్రంప్ హెచ్చరికల్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ‘ మా దేశప్రయోజనాలకే మాకు ముఖ్యమని’ భారత్ ఇప్పటికే ఖరాఖండిగా బదులిచ్చింది.

అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం భారత్‌పై ఏమన్నారు?
భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల పుతిన్ యుద్ధానికి నేరుగా మద్దతు లభిస్తోందని, భారత్ ఇప్పటికే మూల్యం చెల్లిస్తోందని ఆయన విమర్శించారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో ఎంతమంది మృతి చెందారు?
కీవ్ నగరంపై రష్యా జరిపిన దాడిలో 23 మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-green-chili-health-benefits/health/537880/

Google News in Telugu India Russia oil trade controversy Latest News in Telugu Lindsay Graham statement on India Telugu News Today Trump tariffs on India 50 percent US Senator warns India on Russia support US-India relations latest news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.