📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Jair Bolsonaro- పాపం..దేశం నుంచి పారిపోయేందుకు బ్రెజిల్ అధ్యక్షుడు యత్నం

Author Icon By Pooja
Updated: August 21, 2025 • 1:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Jair Bolonaro: దేశ అధ్యక్షులు, ప్రధానమంత్రులు తమ దేశ అభివృద్ధి కోసం పాటుపడేవారు కొందరుఅయితే తమ అధికారాలను అడ్డం పెట్టుకుని అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడే వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారు తమ పదవుల నుంచి దిగిపోగానే ఆ నేరాల నుంచి తప్పించుకునే యత్నం చేస్తుంటారు. ఇలాంటప్పుడు గుట్టుచప్పుడు కాకుండా తమ దేశాల నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు(Former President of Brazil) జైర్ బోలొ నారో చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది. తాను పదవిలో కొనసాగేందుకు తిరుగుబాటుకు కుట్ర పన్నారన్న కేసులో అరెస్టు తప్పదని భావించిన ఆయన, దేశం విడిచి పారి పోయేందుకు యత్నించారని ఫెడరల్ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. పొరుగు దేశమైన అర్జెంటీనాలో రాజకీయ ఆశ్రయం పొందేందుకు ఆయన భారీ స్కెచ్ వేశారని, ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను తాము గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు.

Telugu News: Jair Bolsonaro- పాపం..దేశం నుంచి పారిపోయేందుకు బ్రెజిల్ అధ్యక్షుడు యత్నం

రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న అధ్యక్షుడి మెనెజ్లు

తిరుగుబాటు కుట్ర కేసుకు సంబంధించిన ఫెడరల్ పోలీసులు సుప్రీంకోర్టుకు 170 పేజీల నివేదికను సమర్పించారు. ఇందులో మాజీ అధ్యక్షుడు బోలొ నారోకు సంబంధించిన ఫోన్ మెసేజ్లు, వాయిస్ నోట్స్ ను కీలక ఆధారంగా చేర్చారు. బ్రెజిల్లో తనపై రాజకీయ అణచివేత జరుగుతోందని, ప్రాణహాని ఉందని అర్జెంటీనా అధ్యక్షుడికి సందేశం పంపి, రాజకీయ ఆశ్రయం కోరినట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడునున్న తరుణంలో ఈ వివరాలు బయటకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రెండురోజులు హంగేరియాలో తలదాచుకున్న బోలొ నారో

ఇదే కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు బోలొ నారో గత ఫిబ్రవరిలో హంగేరియన్ రాయబార కార్యాలయంలో(Hungarian Embassy) రెండు రోజులపాటు తలదాచుకున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. తాజా పరిణామాలపై అమెరికాలో ఉంటున్న ఆయన కుమారుడు ఎడ్వర్డ్లో బోలొ నారో స్పందించారు. తన తండ్రితో తాను జరిపిన సంభాషణలను బయటపెట్టడం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ఆయన ఆరోపించారు. తిరుగుబాటు కేసులో తండ్రీకొడుకులపై మరోకేసు నమోదు చేశారు పోలీసులు. న్యాయవిచారణ ప్రక్రియను అడ్డుకున్నారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన పాలనలో ఒక వెలుగు వెలిగిన బ్రెజిల్ అధ్యక్షుడు ఇలాంటి ఆరోపణ ఎదుర్కొవడం విచారకరం. తండ్రీకొడుకులు ఇద్దరికీ న్యాయపరమైన మరిన్ని చిక్కులు తప్పేలా లేవని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

జైర్ బోలొనారోపై ప్రధాన ఆరోపణలు ఏమిటి?


బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోలొనారో తన పదవిని కొనసాగించేందుకు తిరుగుబాటు కుట్ర పన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో ఆయన అర్హత లేని విధంగా అధికారంలో ఉండాలని ప్రయత్నించారు అనే విషయంపై ఫెడరల్ పోలీసుల దర్యాప్తు సాగుతోంది

డరల్ పోలీసులు సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో ఏముంది?

170 పేజీల నివేదికలో:

  1. బోలొనారో పంపిన ఫోన్ మెసేజులు, వాయిస్ నోట్స్
  2. అర్జెంటీనా అధ్యక్షుడిని ఆశ్రయం కోరిన సందేశం
  3. తిరుగుబాటు కుట్రలో పాల్పడిన సంచలన విషయాలు
    వంటి అంశాలు ఉన్నాయి. ఇవి ప్రధాన ఆధారాలుగా పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ahmedabad-school-student-murder-news-telugu/national/533668/

Brazil Breaking News in Telugu escape fromcountry Google News in Telugu hungary Jair Bolsonaro Latest News in Telugu presidentbrazil

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.