📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

 Telugu News: Modi-ట్రంప్ ఆంక్షలను తిప్పికొట్టే యత్నంలో భారత్ ప్లాన్

Author Icon By Pooja
Updated: August 30, 2025 • 3:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Modi: భారతదేశ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలని గతకొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా భారతీయులు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించనియ్యకుండా వారి భవిష్యతిని దెబ్బకొడుతున్నారు. అంతేకాక అధిక టారిఫ్లను విధిస్తూ, కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోర్టులు ఆయన నిర్ణయాలకు అడ్డుపడుతున్నా మొండిగా ముందుకు సాగుతున్నారు. అమెరికా విధించిన కొత్త సుంకాలు, వీసాల ఆంక్షలను ఎదుర్కొనేందుకు భారత్ ఓ అద్భుతమైన ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ క్రమంలో మోదీ ప్రస్తుతం జపాన్ లో రెండురోజుల పర్యటనలో ఉన్నారు. అనంతరం అటు నుంచి చైనా వెళ్లనున్నారు.

అమెరికాపై ఆధారపడకుండా యత్నం

అమెరికా భారతీయ వస్తువుల దిగుమతిపై 50శాతం వరకు సుంకాలను పెంచింది. ముఖ్యంగా వస్త్రాలు, రత్నాలు, ఆబరణాలు, రొయ్యలు, తోటు ఉత్పత్తులు, రసాయనాల వంటి రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీనిని ఎదుర్కోవడానికి భారత్ ఈ చర్యలు తీసుకుంటోంది. అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారత్ ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషిస్తోంది. యూకే, జపాన్, దక్షిణ కొరియా, యూఏఈ, ఈజిప్ట్, బ్రెజిల్ వంటి 40 దేశాలలో వస్త్రాల ఎగుమతులను పెంచడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ జపాన్లో పర్యటిస్తున్నారు.

పలు అంశాలపై మోది జపాన్తో ఒప్పందం

జపాన్ ప్రధాని షిగేర్ ఇషిబాతో కలిసి ప్రధాని మోది(Modi) పలు కీలక చర్చలు జరిపి, రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆర్థిక సహకారం, రక్షణ, సాంకేతికత వంటి రంగాల్లో ఈ ఒప్పందాలు ఒక పదేళ్ల రోడ్ మ్యాప్ను రూపొందించాయి. రాబోయే పదేళ్లలో భారతదేశంలో 10 ట్రిలియన్ల జపనాస్ యెన్ (రూ. 6లక్షల కోట్లు) ప్రైవేట్ పెట్టుబడులు పెట్టడానికి జపాన్ అంగీకరించింది.

దేశీయ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు?

‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వొకల్ ఫర్ లోకల్’ వంటి నినాదాలతో దేశీయ ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దేశీయ వినియోగదారులకు భారం తగ్గించడానికి జీఎస్టీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని కొన్ని నివేదికలు సూచించాయి. ముఖ్యంగా దుస్తులు, సిమెంట్, ఇతర నిత్యావసర వస్తువులపై పన్నులను తగ్గించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ట్రంప్ తన మాటను దిక్కరించే దేశాలపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే విషయంలో భారత్ను నిర్బంధించే యత్నం చేసింది అమెరికా. అయితే దీన్ని భారత్ తిప్పికొట్టింది. తమ దేశ ప్రయోజనాల కోసం ఇతరుల జోక్యాన్ని తాము స్వీకరించమని ఖరాఖండిగా భారత్ చెప్పింది. రష్యా నుంచి చమురు కొనితీరుతామని చెప్పింది. దీంతో వీసాలు, సుంకాలపై ట్రంప్ కఠిన చర్యలకు పూనుకున్నారు.

ట్రంప్ విధించిన ఆంక్షలు ఏ రంగాలపై ప్రభావం చూపుతున్నాయి?
ట్రంప్ విధించిన ఆంక్షలు ముఖ్యంగా వాణిజ్యం, ఎగుమతులు, దిగుమతులు, టెక్నాలజీ రంగాలపై ప్రభావం చూపుతున్నాయి.

భారత్ ఈ ఆంక్షలను తిప్పికొట్టడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటోంది?
భారత్ ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు, కొత్త ఒప్పందాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందించడంపై దృష్టి పెడుతోంది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/telugu-news-banks-new-rules-for-banks-from-september-1st-wrong-amount/business/538392/

Google News in Telugu India economic strategy 2025 India plan against Trump sanctions India US trade relations Latest News in Telugu Modi foreign policy news Modi Trump sanctions Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.