📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: India-భారత్ కు షాక్ ఇచ్చిన జెలెన్ స్కీ..

Author Icon By Sushmitha
Updated: September 8, 2025 • 6:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

India- భారతదేశానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ(zelen sky) బిగ్ షాక్ ఇచ్చారు. గతమూడున్నర సంవత్సరాలుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ పోరులో మిత్రదేశమైన భారత్ ను సాయం కోరింది. అయితే అంతర్జాతీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా తటస్థగా ఉండాలన్న నిర్ణయం మేరకు భారత్ దూరంగా ఉండిపోయింది. అంతేకాక దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ రష్యా నుంచి భారీగా డిసౌంట్ తో చమురును కొంటూ ఆ దేశానికి పరోక్షంగా సాయం చేస్తోంది. దీంతో జెలెన్ స్కీ ట్రంప్కు మద్దతుగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ కు అండగా జెలెన్ స్కీ

భారతదేశం రష్యా నుంచి భారీమొత్తంలో చమురు కొంటున్నామని, రష్యా-ఉక్రెయిన్ దేశాలమధ్య యుద్ధానికి భారత్ ఒక కారణమని ట్రంప్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం విధితమే. అంతేకాదు ఈ కారణంతోనే భారత్ పై ట్రంప్ 50శాతం సుంకాలను విధించారు. ఈ నిర్ణయంపై నేడు (సోమవారం) ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్రంప్ కు (President Trump) అండగా నిలుస్తూ, పలు వ్యాఖ్యలు చేశారు. రష్యాతో యుద్ధం చేస్తున్న దేశాలపై ట్రంప్ అధిక సుంకాలు విధించడం సరైనదే అని అన్నారు.

పుతిన్ పై ఒత్తిడి అవసరం: జెలెన్

రష్యాతో ఇంధన వాణిజ్యాన్ని కొనసాగిస్తున్న తమ యూరోపియన్ మిత్రదేశాలపైనా జెలెన్ స్కీ మాట్లాడుతూ పుతిన్ పై అధిక ఒత్తిడి పెట్టాలని అన్నారు. సౌదీ అరేబియా నుంచి ఒత్తిడి అవసరమని భావిస్తున్నట్లుగా చెప్పారు. రష్యాతో ఒప్పందాలు కొనసాగించే దేశాలపై
సుంకాలు విధించాలనే ఆలోచన సరైనదేనని కితాబిచ్చారు. తమ దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించే దేశాలతో స్నేహసంబంధాలను కొనసాగించలేమన్నారు. భారత్ పై అమెరికా అధిక సుంకాలు విధించడంతో ఇప్పటికైనా భారత్ తన వైఖరిని మార్చుకుంటుదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు జెలెన్ స్కీ.

ఈ వ్యాఖ్యలు భారత్-ఉక్రెయిన్ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?

జెలెన్‌స్కీ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలలో కొంత ఉద్రిక్తతకు దారితీయవచ్చు. అయితే, భవిష్యత్తులో ఈ సంబంధాలు ఎలా ఉంటాయో చూడాలి.

భారతదేశం ప్రపంచ శాంతి సదస్సులో ఎందుకు పాల్గొనలేదు?

ఈ సదస్సులో అన్ని దేశాలూ పాల్గొనాలని, ముఖ్యంగా రష్యా పాల్గొనకపోవడం వల్ల శాంతి చర్చలు సఫలం కావని భారతదేశం అభిప్రాయపడింది. అందుకే తుది ప్రకటనకు మద్దతు ఇవ్వలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-ktr-ktr-says-no-reaction-on-kavitha/telangana/543392/

Google News in Telugu india Latest News in Telugu Peace Summit russia Telugu News Today ukraine Volodymyr Zelenskyy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.