📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Visa-ఉద్యోగం పోతే ఇండియాకు పోతాం.. యూఎస్ లో భారతీయుల అభిప్రాయం

Author Icon By Pooja
Updated: September 1, 2025 • 5:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Visa: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald trump) రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అమెరికాలో విప్లవాత్మక మార్పు వస్తున్నాయి. ప్రత్యేకంగా ట్రంప్ ఫస్ట్ కంట్రీ పీపుల్, నెక్స్ అదర్ కంట్రీ పీపుల్ అంటూ తన దేశప్రజల సంక్షేమాలను దృష్టిలో పెట్టుకుని వీసాలపై కఠిననిబంధనలను తెస్తున్నారు. అక్రమ వలసదారులను నిర్భంధించి మరి వారి స్వదేశాలకు పంపించారు. అక్కడ ఉంటున్న విదేశీయులపై ట్రంప్ ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. వీసాలపై పలు ఆంక్షల్ని పెట్టారు. దీంతో ఓ అజ్ఞాత వర్క్స్ యాప్ బ్లైండ్ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఉద్యోగం పోతో ఏం చేస్తారని ప్రశ్నించగా 45శాతం మంది తాము భారత్ కు తిరిగి వెళ్లిపోతామని చెప్పినట్లు తేలింది. 26శాతం మంది మరో దేశానికి వెళ్తామని చెప్పారు. 29శాతం మాత్రం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు వెల్లడైంది.

అమెరికాను వీడటానికి కారణాలు

యూఎస్ ను వీడటానికి ప్రధానంగా చెబుతున్న కారణాల్లో జీతాల్లో కోతు (25శాతం), నాణ్యత లేని జీవనం (24 శాతం), సాంస్కృతిక లేదా కుటుంబ సమస్యలు, తక్కువ అవకాశాలు ఉన్నాయి. మళ్లీ యూఎస్ వర్క్ వీసాను ఎంచుకుంటారా? అని ప్రశ్నించగా..35శాతం మంది మాత్రమే సుముఖత వ్యక్తం చేశారు. 65శాతం మంది ప్రతికూల లేదా ఎటూ తేల్చుకోలేమనే సమాధానం ఇచ్చారు.

గ్రేస్ పీరియడు ముందే నోటీసులు

అమెరికా టెక్ కంపెనీల్లో భారతీయులను నియమించుకోవడం ఆపేయాలని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హుకుం జారీ చేశారు. ఈ నిర్ణయం తమ సంస్థలకు లాభం చేకూరుస్తుందని యూఎస్ లోని 63శాతం మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. కానీ, తమకు నష్టం చేకూరుస్తుందని భారత్(India) కు చెందిన 69శాతం మంది వర్కర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగం పోతే 60 రోజుల లోపు బహిష్కరణ ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని 35శాతం మంది అభిప్రాయపడ్డారు. గ్రేస్ పీరియడ్ కంటే ముందే తమకు నోటీసులు అందినట్లు మరికొందరు వాపోయారు. తమపై దీర్ఘకాలిక నిషేధం విధిస్తారనే భయం పెరిగిపోయిందని ప్రతి ఆరుగురిలో ఒకరు చెప్పారు.

భారతదేశానికి తిరిగి వెళ్లడానికి ప్రధాన కారణాలు ఏమిటి?

అమెరికాలో నివసించే ఖర్చు పెరగడం, వీసా సమస్యలు, మరియు భారతదేశంలో పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు ప్రధాన కారణాలుగా చెప్పబడ్డాయి.

ఈ సర్వేలో ఎవరు పాల్గొన్నారు?

ఉద్యోగం కోల్పోయిన భారతీయులు మాత్రమే కాకుండా, ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారు కూడా ఈ సర్వేలో పాల్గొన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/telugu-news-minister-ashwini-vaishnav-meets-with-online-gaming-companies/business/539507/

Google News in Telugu Indian diaspora in US Job loss Latest News in Telugu Return to India Tech workers Telugu News Today Visa regulations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.