📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Telugu News: Health- ట్రంప్ ఆరోగ్యంపై కొనసాగుతున్న తీవ్ర ఆందోళన

Author Icon By Pooja
Updated: August 30, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Health: అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా అక్రమవలసదారులపై, వలసదారులపై కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. అమెరికాకు విదేశీయుల రాకను గణనీయంగా తగ్గించివేశారు. దీంతో చదువుకునేందుకు అమెరికా వెళ్లే సంఖ్య ఎన్నడూ లేనివిధంగా తగ్గిపోయింది. అంతటితో ఆగక బలవంతంగా అధిక టారిఫ్లను విధిస్తూ, ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సొంతదేశస్తులే ట్రంప్ దుందుడుకు నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ట్రంప్ ఆరోగ్యం పరిస్థితులపై పలు వార్తలు వస్తున్నాయి. ట్రంప్ బయటకు బాగానే కనిపిస్తున్నా తీవ్రమైన గుండెజబ్బుతో బాధపడుతున్నారని వార్తలొస్తున్నాయి. దీనికి కారణం ఆయన శరీరంలో కనిపిస్తున్న లక్షణాలే అంటున్నారు. కొంతకాలం నుంచి ఆయన ఆరోగ్యస్థితిని గమనిస్తున్నవారు చెబుతున్నది ఏమిటంటే ట్రంప్ ఆరోగ్యం ఏమీ బాగలేదని అంటున్నారు. ఆయనను తీవ్ర అనారోగ్యసమస్యలు వవెంటాడుతున్నాయని.. కానీ దాన్ని ట్రంప్ కానీ, వైట్ హౌస్ కానీ బయటపెట్టడం లేదని అంటున్నారు.

బ్యాలెన్స్ తప్పుతున్న ట్రంప్ నడక

ట్రంప్ కాలి చీలమండల వాపు గురించి, చేతి మీద ఉన్న మచ్చ గురించి ఇంతకు ముందే బయటకు వచ్చింది. ఇప్పుడు వాటితో పాటు ఉబ్బిపోయిన కళ్లు, రంగుమారిపోయిన పెదవులు, నడిచేప్పుడు బ్యాలెన్స్ కోల్పోతుండటం వంటి లక్షణాలను చూపిస్తున్నారు. ఇవన్నీ తీవ్రమైన గుండెజబ్బు లక్షణాలు(Heart disease symptoms), దానికి వాడే మందుల ప్రభావం అని చెబుతున్నారు. అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతినన్ను రెడ్ కార్పెట్పై ఆహ్వానించే సమయంలో ట్రంప్ తూలుతూ నడిచిన తీరును గుర్తుచేస్తున్నారు.

జేడీ వాన్స్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం?

శరీరంలో ఏదైనా భయంకర విపత్తు వస్తే ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా ఉపాధ్యక్షుడు జజేడీ వవాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అధ్యక్ష పదవిని స్వీకరించడానికి అయినా సిద్ధమని చెప్పారు. ట్రంప్ ఆరోగ్యం మీద ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జేడీవాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. యూఎస్ టుడేతో మాట్లాడుతూ వాన్స్ ఈ మాటలు మాట్లాడారు. కొని అనుకోని సంఘటనలు జరుగుతాయి. భయంకర విషాదాలు తలెత్తుతాయి. వాటన్నింటినీ దాటుకుని ట్రంప్ తన పదవీ కాలాన్ని పూర్తి చేశారని అన్నారు. అధ్యక్షుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయనతో పని చేసే వారందరూ చిన్నవాళ్లేనని.. అయితే అందరి కంటే చివర నిద్రపోయేది, ఉదయాన్నే లేచేది మూత్రం అధ్యక్షుడేనని వాన్స్ చెప్పారు. అమెరికన్లకు ట్రంప్ మంచి చేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆయన తీవ్రమైన వ్యాధితో బాధపడుతుండడం వల్ల ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చనే ఉద్దేశంతో వాన్స్ అలా మాట్లాడారని విశ్లేషకులు అంటున్నారు.

ట్రంప్ ఆరోగ్యంపై కరోలినా లీవిట్ ఏమంటున్నారు?

ట్రంప్ ప్రజల మనిషని..మిగతా అధ్యక్షుల కంటే ఎక్కువగా అందరితో షేక్ హ్యాండ్ చేస్తారని అందుకే చేతి మచ్చ ఏర్పడిందని వైట్ హౌస్ సెక్రటరీ కరోలినా లీవిట్ అన్నారు. ఆయన రక్తాన్ని పలుచన చేసే ఆస్ప్రిన్ వాడుతున్నారని.. అందువల్లనే చేతి మీద మచ్చ ఏర్పడిందని వైట్ హౌస్ డాక్టర్ సియాన్ బార్బరెల్లా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ట్రంప్కు 79 ఏళ్లు.. ఈ వయసులో సిరలు వాచడం, మచ్చలు లాంటివి చాలా సహజమని చెప్పుకొచ్చారు.

డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఎందుకు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి?
ట్రంప్ నడకలో బ్యాలెన్స్ కోల్పోవడం, కళ్లు ఉబ్బడం, పెదవుల రంగు మారడం వంటి లక్షణాల వల్ల ఆయనకు గుండె సంబంధిత సమస్యలున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్రంప్ ఆరోగ్యం గురించి అధికారికంగా ఎవరైనా ప్రకటించారా?
వైట్ హౌస్ లేదా ట్రంప్ స్వయంగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే వైట్ హౌస్ వైద్యులు ఆయన వయసుతో సంబంధం ఉన్న సాధారణ సమస్యలేనని చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-metro-train-metro-rail-services-for-ganesh-festival/telangana/538151/

#TrumpHeartCondition DonaldTrumpHealth Google News in Telugu Latest News in Telugu Telugu News Today TrumpNews USPolitics WhiteHouseUpdates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.