Giorgia: స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాక విలువలు పడిపోతున్నాయి. పిల్లలు సైతం చూడకూడని సైట్లను చూస్తూ, వాటినే అనుసరిస్తున్నారు. ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) వచ్చాక ప్రపంచస్వరూపమే మారిపోతున్నది. సెలబ్రిటీలు, ప్రముఖుల ముఖచిత్రాలతో అశ్లీల సైట్లలో పోస్టు చేస్తూ, వారిని అవమానపరుస్తున్నారు. వారి గౌరవాన్ని భంగం కలిగిస్తున్నారు. తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫొటోలతో పోర్న్ వెబ్సైట్లో(porn website) మార్ఫింగ్ చేశారు. దీంతో ఇటలీలో రాజకీయ దుమారం రేపుతున్నది. ఏకంగా దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని సమా పలువురు ప్రముఖ మహిళల ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఆ సైట్లో ప్రచారం చేయడమే ఇందుకు కారణం. ఈ వికృత చర్యపై ప్రధాని మెలోని తీవ్ర ఆగ్రహం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వివాదం నేపథ్యంలో 7లక్షల మందికి పైగా సబ్స్కబర్లు ఉన్న ‘ఫెకా’ అనే ఈ వెబ్సైట్ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
వీరిని కఠినంగా శిక్షించాలి: మెలోని
ఈ దారుణ ఘటనపై మెలోని తీవ్రంగా స్పందించారు. ‘జరిగిన ఘటన పట్ల నాకు తీవ్ర అసహ్యం వేస్తోంది. ఈ చర్య ద్వారా అవమానానికి, వేధింపులకు గురైన మహిళలందరికీ నా పూర్తి సంఘీభావం, మద్దతు ఉంటాయి’ అని ఆమె అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘సాధారణంగా కనిపించే కంటెంట్ కూడా తప్పుడు వ్యక్తుల చేతిలో పడితే భయంకరమైన ఆయుధంగా మారగలదు. బాధితులు వెంటనే ఫిర్యాదు చేయడమే ఉత్తమమైన రక్షణ’ అని ఆమె సూచించారు. ఈ వెబ్సైట్ లో ప్రతిపక్ష నేత ఎల్లీ ప్లీన్ ఫొటోలను కూడా మార్ఫింగ్ చేశారు. ఆమె ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఇది సమాజంలో వేళ్లూనుకుపోయిన ‘రేప్ కల్చర్’కు(rape culture) నిదర్శనమని మెలోని ఆరోపించారు. గతంలోనూ ఆమె ఇలాంటి వేధింపులను ఎదుర్కొన్నారు. డీప్ఫేక్ టెక్నాలజీతో ఆమె ముఖాన్ని ఆశ్లీల వీడియోలను జోడించి ఆన్లైన్ లో పెట్టిన తండ్రీకొడుకులపై ఆమె గత ఏడాది రూ. కోటి నష్టపరిహారం కోరుతూ దావా వేశారు.
ఫికాపై ఇదివరకే పోలీసులకు ఫిర్యాదులు
‘పికా’ లాంటి వెబ్సైట్లపై తమకు చాలా ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. ఆశ్చర్యకరంగా ఈ వెబ్సైట్ 2005 నుంచి పనిచేస్తున్నప్పటికీ ఇన్నాళ్లూ దానిపై చర్యలు తీసుకోలేదు. ఈ సైట్లో భర్తలే తమ భార్యల ఫొటోలను పంచుకోవడం, ఇతరుల భార్యలు లేదా గర్ల్ ఫ్రెండ్స్ ఫొటోలకు హస్తప్రయోగం చేసిన ఆధారాలను పోస్ట్ చేయడం వంటి వికృత చర్యలు ఉండేవని తెలిసింది. ఏదిఏమైనా ఆశ్లీల సైట్లు నేడు సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నాయ. ప్రత్యేకంగా చిన్నపిల్లలు వీటిబారిన పడి పెడదారిన పడుతున్నారు. పురుషులు తమ భార్యలు, బంధువుల ఫొటోలను పెట్టి, సైట్లను వదులుతున్నారు. ఇంకొందరు అయితే ఏకంగా తండ్రులు తమ పిల్లల ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. డబ్బుకోసం, స్వార్థం కోసం సమాజానికి చీడపీడలుగా మారుతున్న ఇలాంటి సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇటలీ ప్రధాని మెలోని ఫొటోలు ఎలా పోర్న్ సైట్లోకి వచ్చాయి?
మెలోని మరియు పలువురు మహిళా నాయకుల ఫొటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకర కంటెంట్‌గా ఆ పోర్న్ సైట్‌లో ప్రచారం చేశారు.
ఈ ఘటనపై ప్రధాని మెలోని ఎలా స్పందించారు?
మెలోని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు సంఘీభావం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: