📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

Telugu News: Earthquake-అమెరికాలో తీవ్ర భూకంపం.. అంటార్కిటికా మంచు ఫలకాల్లో భారీ చీలిక

Author Icon By Pooja
Updated: August 22, 2025 • 1:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Earthquake: దక్షిణ అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావం అంటార్కిటికాపై(Antarctica) తీవ్రంగా పడింది. అక్కడి మంచు ఫలకాలు కదలిపోయాయి. డ్రెక్ ప్యానెజ్అ ల్లకల్లోలానికి గురైంది. ఈ భూకంపం వల్ల దక్షిణ అమెరికాలోని చిలీలో పలు నివాసాలు దెబ్బతిన్నట్లు సమాచారం. సునామీ ముప్పు కూడా ఎక్కువే దక్షిణ అమెరికా-అంటార్కిటికా మధ్య చిలీ సమీపంలో ఈ తెల్లవవారు జామున 2.16 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్స ర్వే తెలిపింది. అర్జెంటినా సదరన్ సిటీ ఉషుయ్ కు దక్షిణ దిశగా 700 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది.

Telugu News: Earthquake-అమెరికాలో తీవ్ర భూకంపం.. అంటార్కిటికా మంచు ఫలకాల్లో భారీ చీలిక

డ్రేక్ పాసేజ్ ఎక్కడ ఉంది?

డ్రేక్ పాసేజ్(Drake Passage) సుమారు 800 నుంచి 1,000 కిలోమీటర్ల వెడల్పు ఉన్న సముద్రమార్గం. చిలీలోని కేప్ హార్న్, అంటార్కిటికా సమీపంలోని సౌత్ షెట్లాండ్(South Shetland) దీవుల మధ్య ఉంటుంది. ఈ సీ రూట్.. నైరుతి అట్లాంటిక్ మహాసముద్రంతో ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది. అంటార్కిటికా వెళ్లడానికి ఇదే ప్రధాన మసుద్ర మార్గం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అంటార్కిటికా సమీపంలోని సౌత్ షెట్లాండ్ దీవుల మధ్య ఉంటుంది. ఈ సీ రూట్ నైరుతి అట్లాంటిక్మ హాసముద్రంతో ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది. అంటార్కిటికా వెళ్లడానికి ఇదే ప్రధాన సముద్ర మార్గం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అంటార్కిటిక్ సర్కమ్ పోలార్ కరెంట్(Antarctic Circumpolar Current) ఇక్కడి నుంచే ప్రవహిస్తుంది. భౌగోళికంగా డ్రేక్ పాసేజ్ వాతావరణ మార్పులు-నియంత్రణ, సముద్ర జీవ వైవిధ్యానికి అత్యంత కీలకమైనదిగా శాస్త్రవేత్తలు భావిస్తుంటారు.

ప్రమాదకరంగా భావిస్తున్న అమెరికా

ఉదయం 7.5 తీవ్రతతో భూమి కంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భూకంప కేంద్రం ఈ డ్రేక్ పాసేజ్ సముద్రతీరం పరిధిలో ఉండటం మరింత ప్రమాదకరమని భావిస్తున్నారు. దక్షిణ అమెరికా అంటార్కిటికా టోక్టోనిక్ ప్లేట్ల పరస్పరం సంఘర్ణణ కారణంగానే ఈ డ్రేక్ పాసేజ్ ఏర్పడినట్లు సైంటిస్టులు వెల్లడించారు. ఇటీవల కాలంలో ప్రపంచంలోని పలు దేశాలు తరచూ వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ప్రకృతిలో వస్తున్న మార్పులే ఇందుకు కారణమని
శాస్త్రవేత్తలు అంటున్నారు.
పెరుగుతున్న వాతావరణ కాలుష్యంతో పాటు వేగంగా పెరుగుతున్న భూతాపం, పెరుగుతున్న జనాభా అవసరాల కోసం విచ్చలవిడిగా భూమి తవ్వకాలతో కూడా ఈ భూకంపాలు సంభవిస్తున్నాయి.

ఈ భూకంపానికి కారణం ఏమిటి?
దక్షిణ అమెరికా–అంటార్కిటికా టెక్టానిక్ ప్లేట్లు ఢీకొనడం వల్ల ఈ భూకంపం సంభవించింది. అదనంగా, భూమి తవ్వకాలు, వాతావరణ కాలుష్యం, భూతాపం పెరుగుదల వంటి కారణాలు కూడా తరచూ భూకంపాలకు దారితీస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడింది?
చిలీలో పలు నివాసాలు దెబ్బతిన్నాయి. అలాగే అంటార్కిటికాలో మంచు ఫలకాలు కదలిపోయాయి, డ్రేక్ పాసేజ్‌లో అల్లకల్లోలం చోటుచేసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-dogs-street-dogs-case-supreme-court-modifies-verdict/national/534345/

Antarctic Circumpolar Current Breaking News in Telugu Chile Earthquake News Drake Passage Quake Google News in Telugu Latest News in Telugu South America Earthquake Tsunami Threat South America

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.