📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

America: గుండెపోటుతో తెలంగాణ యువకుడు మృతి..రెండు నెలల్లో పెళ్లి ఇంతలోనే విషాదం

Author Icon By Vanipushpa
Updated: December 30, 2025 • 4:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉన్నత చదువులు చదివి, అమెరికా(America)లో మంచి ఉద్యోగం సంపాదించి, మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు గుండెపోటుతో మరణించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో విషాదాన్ని నింపింది. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గోశిక యశ్వంత్ కుమార్ (33) అమెరికాలోని డాలస్‌లో సోమవారం గుండెపోటుతో చ‌నిపోయాడు. వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్‌కు చెందిన గోశిక వెంకటేశం, గాయత్రీ దంపతులకు నలుగురు కుమారులు. వీరిలో యశ్వంత్ రెండో కుమారుడు. గత కొంతకాలంగా డాలస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యశ్వంత్, సోమవారం నిద్రలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. ఉదయం ఎంతకీ లేవకపోవడంతో గమనించిన స్నేహితులు.. మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

Read Also: Telangana: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థినుల మృతి

ఏడాది ఫిబ్రవరి 21న వివాహానికి ముహూర్తం

అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే.. యశ్వంత్‌కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న వివాహానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. పెళ్లి పనుల కోసం మరికొద్ది రోజుల్లోనే స్వగ్రామానికి వచ్చేందుకు యశ్వంత్ సిద్ధమవుతున్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లికొడుకుగా చూడాలనుకున్న బిడ్డను విగతజీవిగా చూడాల్సి రావడం ఆ తల్లిదండ్రుల గుండెలను పిండేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu heart attack Heart Attack Tragedy Marriage in Telangana Marriage Plans Sudden Death Telangana Telangana Youth Death Telugu News Paper Tragedy wedding Youth

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.