📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Tejas: దుబాయ్ ఎయిర్ షోలో కూలిన యుద్ధ విమానం…

Author Icon By Sushmitha
Updated: November 21, 2025 • 5:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దుబాయ్‌లో (Dubai) జరుగుతున్న అంతర్జాతీయ ఎయిర్ షోలో (air show) భారత తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ (Tejas) శుక్రవారం కూలిపోయింది. విన్యాసాలు ప్రదర్శిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో పైలట్ మృతి చెందినట్టు వెల్లడైంది.

Read also : Telangana: భారీగా ఐపీఎస్‌ల బదిలీ

Tejas The fighter jet that crashed at the Dubai Air Show…

ప్రమాద వివరాలు, IAF స్పందన

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్ షో చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు చూస్తుండగానే విమానం అదుపుతప్పి వేగంగా కిందకి దూసుకువచ్చి కుప్పకూలింది. భారత వైమానిక దళం (IAF) నుంచి ఈ ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

తేజస్ చరిత్రలో ఇది రెండో ప్రమాదం

తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ విమానం తొలిసారిగా 2024 మార్చిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కూలిపోయింది. అయితే, ఆ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ప్రపంచంలోని అతిపెద్ద ఏవియేషన్ ప్రదర్శనలలో ఒకటైన దుబాయ్ ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తేజస్ 4.5వ తరం మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇందులో పైలట్ సురక్షితంగా బయటపడేందుకు ‘జీరో-జీరో’ ఎజెక్షన్ సీటు వంటి అత్యాధునిక వ్యవస్థ ఉంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Al Maktoum Airport defense Dubai Airshow Fighter Jet crash Google News in Telugu HAL india Indian Air Force Latest News in Telugu Tejas crash Tejas fighter jet Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.