📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

ఛాంపియన్‌గా టీం ఇండియా.. ప్రైజ్ మనీ ఎంతంటే?

Author Icon By sumalatha chinthakayala
Updated: March 10, 2025 • 8:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దుబాయ్‌: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై భారత్ గెలుపొందింది. ఈ తరుణంలోనే 25 ఏళ్ల ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఫైనల్‌లో కివీస్‌ను చిత్తుగా ఓడించింది టీమిండియా. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై భారత్ గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

టీమిండియా ఫ్రైజ్‌ మనీ ఎంతంటే ?

2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్స్ గా నిలిచిన టీమిండియా $2.24 మిలియన్లు అంటే రూ. 20 కోట్లు గెలుచుకుంది. రెండవ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ $1.12 మిలియన్లు అంటే రూ. 10 కోట్లు సంపాదించింది. కాగా, ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన ప్రైజ్ మనీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇప్పటికే ప్రకటించింది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న జట్టుకు దాదాపు రూ. 19.48 కోట్లు ($ 2.24 మిలియన్లు) లభిస్తాయి. ఫైనల్‌లో ఓడిన జట్టు అంటే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు దాదాపు రూ. 9.74 కోట్లు (1.12 మిలియన్ డాలర్లు) లభిస్తాయి.

నిష్క్రమించిన జట్లకు కూడా ప్రైజ్ మనీ

ఇక, సెమీ-ఫైనల్స్‌లో ఓడిపోయిన జట్లు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దాదాపు రూ. 4.87 కోట్లు (US$ 5,60,000) అందుకుంటాయి. గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన జట్లకు కూడా ప్రైజ్ మనీ లభిస్తుంది. ఐదు, ఆరవ స్థానంలో నిలిచిన జట్లు (ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్) సమాన మొత్తంలో $3,50,000 (సుమారు రూ. 3.04 కోట్లు) అందుకుంటాయి. ఏడవ, ఎనిమిదవ స్థానంలో నిలిచిన జట్లు (పాకిస్తాన్, ఇంగ్లాండ్) సమాన మొత్తంలో $1,40,000 (సుమారు రూ. 1.22 కోట్లు) అందుకుంటాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఐసీసీ మొత్తం ప్రైజ్ మనీని $6.9 మిలియన్లు (సుమారు రూ. 60 కోట్లు) అందిస్తోంది. ఇది 2017 కంటే 53 శాతం ఎక్కువ.

Breaking News in Telugu champion Google News in Telugu Latest News in Telugu prize money Team India Telugu News online Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.