📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Teacher: విద్యార్థితో లైంగిక వేధింపులు..మహిళ టీచర్ కు జైలు శిక్ష

Author Icon By Sharanya
Updated: May 12, 2025 • 12:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాఠశాలలు విద్యాబుద్ధుల ఆలయాలు కావాలి. ఉపాధ్యాయులు విద్యార్థులకు జ్ఞానం నేర్పే, వారిలో విజ్ఞానాన్నిపెంపొందించే మార్గదర్శకులై ఉండాలి. కానీ అమెరికా(America)లో జరిగిన ఈ ఘటన ఆ నిబద్ధతకు విరుద్ధంగా, తెరపైకి తెచ్చింది. శాండియాగోలోని లింకన్ ఎకర్స్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన జాక్వెలిన్ మా(36) నైతిక విలువలు మరిచి బాలురపై లైంగిక దాడులకు పాల్పడిన ఉదంతం భయానకమైంది.

పదవిని అవమానపరిచిన టీచర్

జాక్వెలిన్ మా పాఠశాలలో అత్యుత్తమ టీచర్ అవార్డు అందుకున్న ఉపాధ్యాయురాలు. అయితే, జాక్వెలిన్ మా(Jacqueline Ma) తను పాఠాలు చెప్పే 12 ఏళ్ల విద్యార్థిపై కన్నేసింది. బాలుడితో ప్రేమగా ఉంటూ, బహుమతులు ఇస్తూ హోంవర్క్ చేసిపెడుతూ మచ్చిక చేసుకుంది. మాయమాటలు చెప్పి ఆ బాలుడితో తన శారీరక కోరికలు తీర్చుకుంది. దాదాపు పది నెలల పాటు బాలుడితో ఎఫైర్ కొనసాగించింది. బాలుడికి లవ్ లెటర్స్ రాయడం, ఫోన్ లో ప్రేమ సందేశాలు పంపడం చేసింది. అంతకుముందు పదకొండేళ్ల వయసున్న బాలుడితోనూ ఇలాగే చేసింది.

తల్లి అప్రమత్తత – నేరం బయటకు

బాలుడు తరచూ స్కూల్ నుండి ఆలస్యంగా ఇంటికి రావడం వచ్చాక ఫోన్ లో మునిగిపోవడం, టీచర్ తో గంటల తరబడి ఛాటింగ్ చేస్తుండడంతో తల్లి అనుమానించింది. కొడుకుకు చదువు చెప్పే టీచర్ జాక్వెలిన్ మాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

న్యాయస్థాన తీర్పు – కఠిన శిక్ష

దర్యాఫ్తులో జాక్వెలిన్ మా బాగోతం బయటపడడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ విచారణ తర్వాత జాక్వెలిన్ మా నేరం రుజువు కావడంతో కోర్టు ఆమెకు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తన తప్పు ఒప్పుకుంటూ క్షమించాలని కోర్టులో వేడుకున్న జాక్వెలిన్ మా న్యాయమూర్తి తీర్పు వెలువరించగానే కన్నీటిపర్యంతమైంది.

Read also: Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్ లో మీటర్ రీడింగ్ ఎంత ఉండాలి?

#FemaleTeacherArrested #JusticeForStudents #SexualHarassment #StopAbuse #TeacherCrime #TeacherMisconduct #USA Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.