కొవిడ్ సమయంలో మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఇప్పటికీ కొన్ని కంపెనీల్లో అమల్లో ఉంది. ఇప్పటికీ చాలామంది ఐటీ ఉద్యోగులు వారానికి రెండు లేదా మూడురోజులు మాత్రమే ఆఫీసుకి వెళ్తున్నారు. అయితే ఉద్యోగులను తిరిగి ఆఫీసుకి రప్పించడానికి కంపెనీలు ఎంత ప్రయత్నిస్తున్నా అది సాధ్యం కావడం లేదు. ఈ నేపథనయంలో భారతీయ ఐటీరంగంలో అగ్రగామిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)(TCS) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతికి పూర్తిగా స్వస్తి పలకాలని నిర్ణయించింది. బెంగళూరు సహా దేశవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలకు ఉద్యోగులు కచ్చితంగా రావాల్సిందేనని, లేనిపక్షంలో వారి యాన్యువల్ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వంటివి నిలిపివేస్తామని సంచలన నిర్ణయం తీసుకుంది.
Read Also: Iran Crisis: ఇరాన్‌లో ఆందోళనలు.. 200 మందికి పైగా మృతి!
నిబంధనలు పాటించని ఉద్యోగులకు షాక్
టిసిఎస్ నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు వారానికి ఐదు రోజులు ఆఫీసు నుంచి పని చేయాలి. అయితే గత కొన్ని ట్రెవాసికాలుగా ఈ నిబంధనను పాటించని ఉద్యోగులకు కంపెనీ షాక్ ఇచ్చింది. ‘మీ వార్షిక అప్రైజల్ ప్రక్రియ పూర్తయినప్పటికీ మీరు ఆఫీస్ అటెండెన్స్ నిబంధనలు పాటించనందుకు దానిని ముందుకు తీసుకెళ్లడం లేదు’ అంటూ సంబంధిత ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపింది. ఫలితంగా జీతాల పెంపు, ప్రమోషన్లకు అవకాశం ఉండదు. వారికి ఎలాంటి పెర్ఫార్మెన్స్ బ్యాండ్ విడుదల చేయబడదు, ఎఫ్ బాండింగ్ సైకిల్ నుండి మినహాయించబడతారు. దేశంలోని ఇతర ఐటీ కంపెనీలు వారానికి రెండు లేదా మూడు రోజులు ఆఫీసుకు వస్తే చాలని చెబుతుంటే టిసిఎస్ మానరతం ఐదు రోజులు కచ్చితంగా రావాలని నిబంధన పెట్టింది.
బెంగళూరు ఐటీ మార్కెట్‌పై ప్రభావం
బెంగళూరులోని లక్షలాది మంది ఐటీ ఉద్యోగులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆఫీస్ రావడానికి ట్రాఫిక్ సమస్యలు, అద్దె ఇళ్ల కొరత వంటి కారణాలు చూపుతున్న ఉద్యోగులకు TCS తీసుకున్న ఈ కఠిన చర్య ఒక హెచ్చరికగా మారింది. ఇతర ఐటీ కంపెనీలు కూడా భవిష్యత్తులో ఇదే బాట పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఐటీ రంగంలో మళ్ళీ ‘ఆఫీస్ కల్చర్’ ను బలంగా తీసుకురావడానికి TCS చేస్తున్న ఈ ప్రయత్నం ఉద్యోగుల్లో మిశ్రమ స్పందనను కలిగిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: