📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

TCS: టీసీఎస్ ఉద్యోగులను వెంటాడుతున్న భయం..

Author Icon By Vanipushpa
Updated: July 11, 2025 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(Tata Consultancy Services) (TCS) ఇంకా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాలరీ ఇంక్రిమెంట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఆలస్యం కావడం ఉద్యోగుల్లో భవిష్యత్ భద్రతపై సందేహాలు, ఆందోళనలకు దారితీస్తోంది. TCS మానవ వనరుల విభాగం మిలింద్ లక్షద్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి(Global financial crisis) క్లయింట్ డీల్ వాయిదాలు, ఒప్పందాల ఆలస్యం వంటి అంశాల వల్ల సాలరీ రివిజన్‌ గురించి తుది నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. అదనంగా, సంస్థ CEO కృష్ణివాసన్ మాట్లాడుతూ, ”మేము ఉద్యోగుల కష్టాన్ని గుర్తిస్తున్నాం. కానీ వేతనాల పెంపు వంటి ముఖ్యమైన అంశంపై స్పష్టత ఉన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటాం.

TCS :టీసీఎస్ ఉద్యోగులను వెంటాడుతున్న భయం..

నో సాలరీ ఇంక్రిమెంట్

ప్రస్తుతం మార్కెట్‌లో కొన్ని అనిశ్చితులు ఉన్నాయ”ని చెప్పారు. ప్రతిసారి TCS సాధారణంగా ఏప్రిల్ 1న జీతం పెంపు ప్రక్రియను, ఉద్యోగులకు సాలరీ ఇన్క్రిమెంట్లు ప్రకటిస్తూ ఉంటుంది. కానీ ఈ ఏడాది కంపెనీ అలా చేయలేదు. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో, ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం TCSలో పనిచేస్తున్నవారిలో ముఖ్యంగా మధ్యస్థాయి మరియు జూనియర్ లెవల్ ఉద్యోగులు ఈ ఆలస్యం ఇబ్బందిని వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా కంపెనీ ఆదాయం పెరిగినప్పటికీ, సేలరీ హైక్స్ విషయంలో ఆలస్యం జరగడం వారి ఆర్థిక భద్రతపై ప్రభావం చూపిస్తోంది.

దీర్ఘకాలిక ప్రణాళికపై దృష్టి

మొత్తం హెడ్‌కౌంట్ 6,13,069కి చేరింది. కానీ గత సంవత్సరం తీసుకున్న 42,000 కొత్త ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను పూర్తిగా జాబితాలోకి తీసుకోవడంలో కంపెనీకి ఇబ్బంది ఎదురవుతోంది. దీనివల్ల భవిషత్తులో నియామకాలపై పడుతుంది. తక్కువ ఆదాయ వృద్ధి ఉన్నప్పటికీ, TCS దీర్ఘకాలిక ప్రణాళికపై దృష్టి పెట్టింది. కానీ తాత్కాలికంగా జీతాలు, ఉద్యోగ నియామకాలు వంటి అంశాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ఇలా, TCS జీత పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయడం భారత ఐటీ రంగంలో పెద్ద హెచ్చరికగా భావించవచ్చు. ఇది ఇతర కంపెనీలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది .

కె. కృతివాసన్ (1 జూన్ 2023–)
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ / CEO
మిస్టర్ కె కృతివాసన్
కృతి అని కూడా పిలువబడే కె. కృతివాసన్ జూన్ 1, 2023న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) యొక్క CEO మరియు MD అయ్యారు. టెక్నాలజీ పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవంతో, శ్రీ కృతి వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ ల్యాండ్‌స్కేప్‌లో TCSను అగ్రగామిగా నిలిపారు.9 ఏప్రిల్ 2025
TCS కంపెనీ దేనికి ప్రసిద్ధి చెందింది?
1968లో స్థాపించబడినప్పటి నుండి, TCS ఆవిష్కరణ, ఇంజనీరింగ్ నైపుణ్యం మరియు కస్టమర్ సేవ యొక్క అత్యున్నత ప్రమాణాలను సమర్థించింది. టాటా గ్రూప్ వారసత్వంలో పాతుకుపోయిన TCS, దాని క్లయింట్లు, దాని పెట్టుబడిదారులు, దాని ఉద్యోగులు మరియు మొత్తం సమాజానికి దీర్ఘకాలిక విలువను సృష్టించడంలో దృష్టి సారించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Modi: 17 సార్లు విదేశీ పార్లమెంట్లలో ప్రసంగంతో మోదీ ఘనత

Employee Concerns Indian IT Sector IT Layoffs job security TCS TCS employees TCS Job Cuts TCS News TCS Workforce

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.