📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: US-చార్లీ కిర్క్‌ను చంపింది నేనే.. నేరం అంగీకరించిన టైలర్ రాబిన్సన్

Author Icon By Vanipushpa
Updated: September 17, 2025 • 5:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్‌(charlie kirk)ను హత్య చేసినట్లు అనుమానిస్తున్న టైలర్ రాబిన్సన్.(Tyler Robinson). తన ట్రాన్స్‌జెండర్ భాగస్వామికి పంపిన మెసేజ్‌లలో నేరాన్ని అంగీకరించాడు. హత్య ఎలా చేశాడో, తుపాకీ ఎవరిచ్చారో కూడా వివరంగా చెప్పాడు. తన తాతయ్య తుపాకీ వాడానని.. అయితే పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు దాన్ని అక్కడే పడేశానని వివరించాడు. ఇప్పుడు తండ్రికి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని వాపోయాడు. అసలు ఈ హత్యకు గల కారణం ద్వేషమా లేక వ్యక్తిగత వైరమా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

America-చార్లీ కిర్క్‌ను చంపింది నేనే.. నేరం అంగీకరించిన టైలర్ రాబిన్సన్

భాగస్వామి లాన్స్ ట్విగ్స్‌కు పంపిన మెసేజ్‌ల్లో ఒప్పుకున్న రాబిన్సన్
కన్సర్వేటివ్ యాక్టివిస్ట్(conservative Activities) చార్లీ కిర్క్‌ను హత్య చేసినట్లు అనుమానిస్తున్న టైలర్ రాబిన్సన్.. తన నేరాన్ని అంగీకరించాడు. మఖ్యంగా కిర్క్‌ను చంపింది తానేనని తన ట్రాన్స్‌జెండర్ భాగస్వామి లాన్స్ ట్విగ్స్‌కు పంపిన మెసేజ్‌ల్లో ఒప్పుకున్నాడు. అయితే హత్య అనంతరమే ఈ మెసేజీలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఇది మాత్రమే కాకుండా హత్య చేసిన విధానం, తనకు తుపాకీ ఎవరు ఇచ్చారు, ఆపై దాన్ని ఏం చేశాడనే విషయాలను కూడా ఆమెతో పంచుకున్నాడు.
ఓ చోట ఇరుక్కుపోయాను మై లవ్ అంటూ మెసేజ్
హత్య జరిగిన వెంటనేరాబిన్సన్ తన భాగస్వామికి మెసేజ్ చేశాడు. “నేను బాగానే ఉన్నాను మై లవ్, కానీ ఓ చోట ఇరుక్కుపోయాను. త్వరలోనే ఇంటికి రాగలను. కానీ నేను నా రైఫిల్‌ను తీసుకురావాలి. నిజం చెప్పాలంటే ఇది చనిపోయేదాకా రహస్యంగా ఉంచాలనుకున్నాను. నిన్ను ఇందులో ఇరికించినందుకు నన్ను క్షమించు” అని రాబిన్సన్ తెలిపాడు. దీనికి ప్రతిగా అతని భాగస్వామి “ఆ పని చేసింది నువ్వేనా?” అని ఆశ్చర్యంగా ప్రశ్నించగా.. “నేనే, నన్ను క్షమించు” అని రాబిన్సన్ బదులిచ్చాడు.

చార్లీ కిర్క్ ఎందుకు ప్రసిద్ధి చెందాడు?
చార్లెస్ జేమ్స్ కిర్క్ (అక్టోబర్ 14, 1993 - సెప్టెంబర్ 10, 2025) ఒక అమెరికన్ మితవాద సంప్రదాయవాద రాజకీయ కార్యకర్త, రచయిత మరియు మీడియా వ్యక్తిత్వం. అతను 2012లో సంప్రదాయవాద విద్యార్థి సంస్థ టర్నింగ్ పాయింట్ USA (TPUSA)ను సహ-స్థాపించాడు మరియు దాని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నాడు.

చార్లీ కిర్క్ భార్య ఏ మతస్థురాలు?

కిర్క్ భర్త మరియు ఇద్దరు చిన్న పిల్లల తండ్రి. అతని భార్య ఎరికా ఫ్రాంట్జ్వే, మాజీ మిస్ అరిజోనా, తరచుగా అతని కార్యక్రమాలకు హాజరయ్యేది. ఈ జంట భక్తిగల సువార్తిక క్రైస్తవులు మరియు వారి జీవితాల్లో మార్గదర్శక శక్తిగా వారి విశ్వాసం గురించి తరచుగా మాట్లాడుకునేవారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/pm-modi-mukesh-ambani-wishes-pm-narendra-modi-on-his-birthday/national/549007/

Breaking News Breaking News in Telugu Criminal Investigation Google news Paper Telugu News Taylor Robinson Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.