బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ (BNP) పార్టీ చీఫ్ తారిక్ రెహమాన్(Tariq Rahman) ఆ దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్ధీన్ ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు. ఇటీవల అక్కడ జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీఎన్‌పీ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మిత్ర పక్షాలతో కలిసి 299 స్థానాలకు 212 చోట్ల గెలిచింది.
Read Also: AI: AI రీప్లేస్ చేయబోయే జాబ్స్ లిస్ట్ బయటపెట్టిన మైక్రోసాఫ్ట్!
17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన తారిక్ రెహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టం ప్రాధాన్యం సంతరించుకుంది.ఈ కార్యక్రమానికి భారత్ తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. “చట్టం ప్రకారం ప్రభుత్వ ప్రధానమంత్రి పదవి విధులను నేను నమ్మకంగా నిర్వర్తిస్తాను” అని ఆయన అన్నారు, పార్లమెంట్ భవనం వెలుపల జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు మరియు రాష్ట్ర టెలివిజన్‌లో ప్రసారం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: