బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ (Tarique Rahman) తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ విజయం పార్టీది కాదని, ఇది బంగ్లాదేశ్ ప్రజల విజయం అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని తెలిపారు.
Read Also: Jensen Huang: AI సమ్మిట్‌కు NVIDIA సీఈవో దూరం..కారణాలేమిటి?
భారత్, చైనా వంటి దేశాలతో సంబంధాలలో సమతుల్యత
ఇప్పుడు మనమంతా స్వేచ్ఛను పొందామని, హక్కులకు అసలైన అర్థాన్ని తిరిగి సంపాదించుకున్నామని ఆయన పేర్కొన్నారు.బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారందరికీ ఈ విజయన్ని అంకితమిస్తున్నామని అన్నారు.కాగా, భారత్, చైనా వంటి దేశాలతో సంబంధాలలో సమతుల్యత పాటిస్తామని తారిఖ్ రెహ్మాన్ గతంలో అన్నారు. రెండు దేశాల నిర్ణయాలు, ప్రయోజనాలపై ఆధారపడి భారత్‌తో తమ సంబంధాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ ప్రజలు బీఎన్పీకి అఖండ విజయాన్ని అందించిన నిర్ణయాత్మక తీర్పుతో యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ అరాచక పాలన ముగిసింది. దీంతో, న్యూఢిల్లీ, ఢాకా మధ్య దౌత్యపరమైన పునరుద్ధరణకు తిరిగి తలుపులు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఆచితూచి అడుగులు వేయనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: