📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

News Telugu: Tariffs: ఎట్టకేలకు దిగొచ్చిన ట్రంప్.. భారత్ కు సుంకాలు తగ్గిస్తాం

Author Icon By Rajitha
Updated: November 11, 2025 • 5:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) మంగళవారం భారతదేశంతో జరుగుతున్న వాణిజ్య చర్చల సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. మేం సుంకాలను తగ్గిస్తాం, ఏదో ఒక సమయంలో వాటిని తగ్గిస్తామని స్పష్టం చేశారు. రష్యాతో భారతదేశం చేస్తున్న చమురు వ్యాపారం కారణంగా అమెరికా విధించిన అధిక సుంకాలు ఇక తగ్గవచ్చని ఆయన సంకేతం ఇచ్చారు. భారతదేశం రష్యన్ చమురును గణనీయంగా నిలిపివేసిందని పేర్కొంటూ ఇప్పుడు న్యాయమైన వాణిజ్య ఒప్పందం వైపుకు ఇరుదేశాలు అడుగులు వేస్తున్నాయని ట్రంప్ అన్నారు.

Read also: Spider: థాయ్ లాండ్ లో కొత్తరకం సాలీడు గుర్తించిన శాస్త్రవేత్తలు

Tariffs: ఎట్టకేలకు దిగొచ్చిన ట్రంప్..

ట్రంప్ పై ఒత్తిడి

Tariffs: ఆగస్టులో అమెరికా భారత దిగుమతులపై సుంకాలను 50శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం రష్యాపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగమని వైట్ హౌస్ అప్పట్లో ప్రకటించింది. ఉక్రెయిన్ పై మాస్కో దాడి కొనసాగుతున్న నేపథ్యంలో భారతదేశం రష్యా చమురు కొనుగోలును తగ్గించాలనే ఒత్తిడి వాషింగ్టన్ నుంచి వచ్చింది. ఇప్పుడు భారతదేశం రష్యాతో చమురు దిగుమతులను తగ్గించిందనే సంకేతాల నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు సుంకాల సడలింపుకు మార్గం సుగమం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యల్లో ప్రధానమైన అంశం ఏంటంటే.. ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్న సంబంధాన్ని ప్రస్తావించంటం.

గతంలో తనకు మోడీ భరోసా ఇచ్చారని ఆయన చెప్పారు. అయితే, ఆ సమయంలో భారత్ ఎటువంటి అధికార సంభాసణ జరగలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, ట్రంప్ ఇప్పటికీ ఆ హామీను నమ్ముతూ, రెండు దేశాలు మళ్లీ బలమైన వాణిజ్య బంధం వైపుకు పయనిస్తున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న వాణిజ్య చర్చలపై మాట్లాడిన ట్రంప్ మేం భారతదేశంతో గతంలో ఉన్న దానికంటే భిన్నమైన ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. ఇప్పుడు వారు నన్ను ప్రేమించకపోవచ్చు. కానీ త్వరలో మళ్లీ మనల్ని ప్రేమిస్తారు. మనకు న్యాయమైన వాణిజ్య ఒప్పందం కుదురుతోందని అన్నారు. ఇది ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు సమతుల్యంగా మారతాయని సూచిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

India-US Trade latest news modi tariffs Telugu News trump

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.