हिन्दी | Epaper

Trade Deal Impact: సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

Vanipushpa
Trade Deal Impact: సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

భారతదేశం అమెరికా(India, America) మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం భారత ఎగుమతిదారులకు తక్షణ ఉపశమనాన్ని కలిగించే కీలక పరిణామంగా మారింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా.. భారతీయ వస్తువులపై విధిస్తున్న పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రావడంతో.. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో కొత్త దశ ప్రారంభమైనట్లుగా మార్కెట్లు భావిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని అధికారికంగా ధృవీకరించారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందానికి మేము అంగీకరించాము. దీని ద్వారా పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నాం. అలాగే భారతదేశం కూడా అమెరికాపై ఉన్న సుంకాలు, నాన్-టారిఫ్ అడ్డంకులను పూర్తిగా తొలగించేందుకు ముందుకు వస్తోందని ఆయన తెలిపారు. ఇది వేగవంతమైన అమలు, పరస్పర మార్కెట్ ప్రాప్యతకు స్పష్టమైన సంకేతంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంతకుముందు అమెరికా మార్కెట్లో కొన్ని భారతీయ ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలు ఉండటం వల్ల.. భారత ఎగుమతిదారుల పోటీతత్వం తీవ్రంగా దెబ్బతింది.

Read Also: Massoud Pezeshkian: అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా

Trade Deal Impact: సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..
Trade Deal Impact: సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

మోదీ దూకుడు దెబ్బకు దిగొచ్చిన ట్రంప్

సుంకాల ఉపశమనం నేపథ్యంలో పెట్టుబడిదారుల దృష్టి ఎగుమతి ఆధారిత రంగాల వైపు మళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా గతంలో అధిక సుంకాల కారణంగా ఆదాయాలు ఒత్తిడికి గురైన రంగాల్లో ఇప్పుడు పునరుజ్జీవనం కనిపించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.. భారత వస్తువులపై 50 నుండి 18 శాతానికి సుంకాలు తగ్గింపు.. గ్రీన్ పోర్ట్‌ఫోలియో PMS సహ వ్యవస్థాపకుడు దివమ్ శర్మ మాట్లాడుతూ.. వస్త్రాలు, దుస్తులు, ఆటో అనుబంధాలు, ఇంజనీరింగ్, స్పెషాలిటీ రసాయనాలు, వ్యవసాయ, సముద్ర ఆహార ఎగుమతులు, అలాగే US ఎక్స్‌పోజర్ ఉన్న కొన్ని ఎలక్ట్రానిక్స్, వినియోగదారు తయారీ రంగాలు ప్రధానంగా లాభపడే అవకాశం ఉంది. ఇది ఎగుమతులు, తయారీపై దృష్టి పెట్టిన తాజా బడ్జెట్‌కు అనుగుణంగా ఉందని అన్నారు.

సుంకాల తగ్గింపు ఈ రంగానికి పెద్ద ఊరట

వస్త్రాలు, దుస్తుల రంగం ఈ ఒప్పందం ద్వారా అతిపెద్ద లబ్ధిదారులలో ఒకటిగా నిలవనుంది. భారత వస్త్ర ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు 28 శాతం ఉండటంతో.. సుంకాల తగ్గింపు ఈ రంగానికి పెద్ద ఊరటగా నిలవనుంది. అలాగే సముద్ర ఆహార రంగం, ముఖ్యంగా రొయ్యల ఎగుమతులు చేసే కంపెనీలకు డిమాండ్ రికవరీ అవకాశాలు మెరుగవుతాయని అంచనా వేస్తున్నారు. ఆటోమొబైల్, ఆటో అనుబంధ రంగాల్లో అమెరికాకు ఎక్స్‌పోజర్ ఉన్న కంపెనీలు స్థిరమైన ఆర్డర్ ప్రవాహాలను చూడవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆటోమొబైల్ విడిభాగాలపై కూడా అధిక సుంకాలు

భారత్ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యే రత్నాలు, ఆభరణాల రంగానికి కూడా ఈ ఒప్పందం లాభదాయకంగా మారనుంది. అదేవిధంగా పారిశ్రామిక, ఇంజనీరింగ్ ఉత్పత్తులు అయిన స్టీల్, రసాయనాలు వంటి వాటికి మార్కెట్ యాక్సెస్ సులభతరం కానుందని అంచనా. వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పప్పు ధాన్యాలు, పాల ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గితే, పెరుగుతున్న ఆహార ధరల ఒత్తిడి కొంత మేర తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల వినియోగదారుల ఖర్చులు నియంత్రణలోకి రావచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ ఒప్పందంలో అన్ని ఉత్పత్తులకు పూర్తిస్థాయి సడలింపులు లభించలేదని విశ్లేషకులు చెబుతున్నారు. స్టీల్, అల్యూమినియం, రాగి వంటి కొన్ని ఉత్పత్తులపై దాదాపు 50 శాతం వరకు సుంకాలు కొనసాగనున్నట్లు సమాచారం. అలాగే కొన్ని ఆటోమొబైల్ విడిభాగాలపై కూడా అధిక సుంకాలు యథాతథంగా ఉండే అవకాశముంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870