📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Taiwan: చైనాకు దీటుగా బదులిచ్చేందుకు తైవాన్ రె’ఢీ’

Author Icon By Vanipushpa
Updated: July 10, 2025 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనా(China) మరోసారి పసిఫిక్ మహాసముద్రంలో సైనిక ఉద్రిక్తతలను పెంచింది. తైవాన్(Taiwan) తీరాన్ని గురువారం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)కి చెందిన 12 యుద్ధవిమానాలు, 7 నౌకలు చుట్టుముట్టాయి. తమ పరిసర జలాల్లో యుద్ధ విమానాలు, నౌకలు కదలాడినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఎన్​డీ) తెలిపింది. ఈ విమానాల్లో పది విమానాలు మధ్యరేఖను దాటి, తైవాన్ దక్షిణ–పశ్చిమ గగన రక్షణ గుర్తింపు మండలిలోకి చొరబడ్డాయని వివరించింది. అయితే చైనాకు దీటుగా బదులిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎంఎన్​డీ పేర్కొంది. ‘చైనా(China) సైనిక కదలికలపై తైవాన్ తగిన జవాబు ఇచ్చింది. మా సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ భద్రతను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మా విమానాలు, నావికాదళ నౌకలు, తీర రక్షణ క్షిపణి వ్యవస్థలు మోహరించాం. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం’ తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Tiwan: చైనాకు దీటుగా బదులిచ్చేందుకు తైవాన్ రె’ఢీ’

హాన్ గువాంగ్ 2025′ పేరుతో తైవాన్ భారీ స్థాయిలో సైనిక డ్రిల్స్

తీరంలో చైనా ఉద్రిక్తతలు పెంచుతున్న నేపథ్యంలో ‘హాన్ గువాంగ్ 2025’ పేరుతో తైవాన్ భారీ స్థాయిలో సైనిక డ్రిల్స్ చేపట్టింది. ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ రోజులుపాటు ఈ డ్రిల్స్ నిర్వహించాలని తైవాన్ నిర్ణయించింది. ఈ డ్రిల్స్​లో తాజా తయారు చేసిన ఆయుధాలు, అమెరికా నుంచి దిగుమతి చేసిన M1A2T అబ్రామ్స్ ట్యాంకులు, హై మొబిలిటీ ఆర్టిల్లరీ రాకెట్ సిస్టమ్ వంటివి వినియోగించనున్నారు. ఈ డ్రిల్స్‌లో అన్ని సర్వీసుల రెగ్యులర్ దళాలతో పాటు 22,000 మంది రిజర్వ్ ఫోర్స్ కూడా పాల్గొననుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ డ్రిల్స్ జరగనున్నాయి.
సైనిక విన్యాసాల సమయంలో విమాన ప్రయాణాలు, రవాణా వ్యవస్థలో తాత్కాలిక అంతరాయాలు ఏర్పడే అవకాశమున్నాయని తైవాన్ ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే డ్రిల్స్ నేపథ్యంలో ప్రచారమవుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
అధికార పార్టీపై చైనా మండిపాటు
తైవాన్ సైనిక డ్రిల్స్ పై చైనా ధ్వజమెత్తింది. హాన్ గువాంగ్ డ్రిల్స్ పేరుతో తైవాన్ అధికార పార్టీ డీపీపీ ఆదేశ ప్రజలను మోసం చేస్తోందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కర్నల్ జియాంగ్ బింగ్ విమర్శించారు. డీపీపీ పార్టీ ప్రస్తుతం తైవాన్​లో అధికారంలో ఉంది. తైవాన్​పై చైనా ఆధిపత్యాన్ని డీపీపీ వ్యతిరేకిస్తోంది. తైవాన్ స్వతంత్య్రాాన్ని డీపీపీ కోరుతోంది. ఈ క్రమంలో అధికార డీపీపీ చర్యలపై చైనా తీవ్ర వివర్శిస్తోంది. తైవాన్ ప్రజలను ‘స్వతంత్య్రం’ పేరిట డీపీపీ భ్రమింపజేస్తోందని కర్నల్ జియాంగ్ బింగ్ అన్నారు. ‘వాళ్లు ఎంత శిక్షణ తీసుకున్నా, ఎంత ఆధునిక ఆయుధాలు వినియోగించినా, చైనా దాడిని తట్టుకోలేరు. తైవాన్ – చైనా పునఃఏకీకరణ చారిత్రక అవసరం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఎనిమిది రక్షణ సంస్థలపై ఎగుమతి నియంత్రణ

తైవాన్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో భాగంగా చైనా బుధవారం కీలక ప్రకటన చేసింది. తైవాన్‌కు చెందిన ఎనిమిది రక్షణ సంస్థలపై ఎగుమతి నియంత్రణలు విధించింది. ఈ సంస్థలకు సివిలియన్, మిలిటరీ రెండింటికీ ఉపయోగపడే “డ్యూయల్-యూజ్” వస్తువుల ఎగుమతిని వెంటనే నిషేధించింది. అయితే ఈ ఆంక్షలపై తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చియావో ఫు-చున్ దీటుగా సమాధానం ఇచ్చారు. తైవాన్ రక్షణ పరిశ్రమలు ఎప్పుడో చైనా తయారీ భాగాలను వినియోగించడం ఎప్పుడో మానేసినట్పు చెప్పారు. తయారీ మొత్తం తైవాన్‌లోనే జరుగుతోందని, కాబట్టి చైనా నిషేధాలు తమపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేశారు .

చైనా నుండి తైవాన్ ఎందుకు విడిపోయింది?
చైనా ప్రధాన భూభాగం నుండి తైవాన్ విడిపోవడం రాజకీయ మార్పులు మరియు సంఘర్షణల సంక్లిష్ట చరిత్రలో పాతుకుపోయింది. 1895లో మొదటి చైనా-జపనీస్ యుద్ధంలో చైనా ఓటమి తరువాత,తైవాన్‌ను జపాన్‌కు అప్పగించారు.
తైవాన్ ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది?
తైవాన్ రాత్రి మార్కెట్లు మరియు వీధి ఆహారానికి ప్రసిద్ధి చెందింది. నిజానికి, మొత్తం సందర్శకుల సంఖ్య ప్రకారం, తైవాన్ రాత్రి మార్కెట్లు సమిష్టిగా పరిగణించబడేవి దేశంలోని అగ్ర పర్యాటక ఆకర్షణ.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Elon Musk: ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ భగ్గుమన్న విభేదాలు

#telugu News China Taiwan conflict cross-strait tensions Indo-Pacific security Taiwan China tensions Taiwan defense Taiwan military readiness Taiwan response to China

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.