Switzerland bar blast : Crans-Montanaలో న్యూ ఇయర్ వేడుకలు విషాదంగా మారాయి. స్విట్జర్లాండ్‌లోని ఈ లగ్జరీ స్కీ రిసార్ట్ పట్టణంలో ఉన్న ‘లే కాన్స్టెలేషన్’ అనే బార్‌లో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్న (Switzerland bar blast) సమయంలో రాత్రి సుమారు 1:30 గంటలకు ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి వరకు బార్‌లో 100 మందికి పైగా పార్టీ చేసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది పర్యాటకులే ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Read Also: TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు
పేలుడు కారణం ఇంకా తెలియరాలేదని వాలిస్ కాంటన్ పోలీసు ప్రతినిధి గయటాన్ లాథియన్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోల్లో బార్‌లో భారీగా మంటలు చెలరేగినట్లు కనిపిస్తోంది.
సంఘటన స్థలానికి ఫైర్ సర్వీసులు, పోలీసు బృందాలు, హెలికాప్టర్లు చేరుకున్నాయి. బాధితుల కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా క్రాన్స్-మోంటానా ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి, నో-ఫ్లై జోన్ ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: