📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Gold Rates: అమెరికాకు షాకిచ్చిన స్విస్.. దెబ్బకు దిగొచ్చిన ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: August 11, 2025 • 12:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగారం ధర తగ్గేదిశగా అమెరికా(america) కీలక నిర్ణయం తీసుకోబోతోంది. అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బంగారు కడ్డీలపై విధించిన సుంకాలను మినహాయించేందుకు ఒక ముఖ్యమైన కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తకు సంబంధించిన సమాచారం.. బ్లూమ్‌బెర్గ్ ఆధారంగా Investing.com ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇటీవల బంగారం ధరలు గందరగోళం, అనిశ్చితి కారణంగా చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకోవడంతో.. ప్రపంచ మార్కెట్ ఈ నిర్ణయాన్ని ఆసక్తిగా గమనిస్తోంది.
ఈ మధ్య US కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ కామెక్స్‌లో అత్యధికంగా వ్యాపారం జరిగే బంగారం.. ఒక కిలోగ్రాము, 100 ఔన్సుల బులియన్ బార్‌లపై దేశ-నిర్దిష్ట సుంకం విధించనుందని ప్రకటించింది. దీని ఫలితంగా..ప్రపంచ బంగారు శుద్ధి పరిశ్రమలో నంబర్ వన్ గా ఉన్న స్విట్జర్లాండ్(Switzerland) నుండి US‌కు జరిగే దిగుమతులు..దాదాపు 39 శాతం వరకు సుంక భారం ఎదుర్కోవలసి వస్తుందనే ఆందోళనలు పెరిగాయి.

Gold Rates: అమెరికాకు షాకిచ్చిన స్విస్.. దెబ్బకు దిగొచ్చిన ట్రంప్

తాజా నిర్ణయం వల్ల US‌కు బంగారం సరఫరా నిలిచిపోయింది

దీంతో అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని సమాచారం.
స్విట్జర్లాండ్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల US‌కు బంగారం సరఫరా నిలిచిపోయింది. రాయిటర్స్ కథనం ప్రకారం.. కొన్ని స్విస్ రిఫైనరీలు అనిశ్చితి కారణంగా తమ సరఫరాలను తాత్కాలికంగా ఆపివేశాయి. ఇదే విధమైన సుంకాలు కొనసాగితే.. కామెక్స్, లండన్ Gold ధరల మధ్య వ్యత్యాసం పెరిగే అవకాశం ఉంది. తద్వారా కొత్త ఆర్బిట్రేజ్ అవకాశాలు సృష్టించవచ్చని బంగారం నిపుణులు భావిస్తున్నారు. గత సంవత్సరం స్విట్జర్లాండ్ .. అమెరికాకు 61.5 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ఎగుమతి చేసింది. ఇందులో ఎక్కువగా ఒక కిలో బంగారు కడ్డీలు ఉన్నాయి. ఇప్పుడు 39 శాతం సుంకం విధిస్తే.. అదనపు ఖర్చు 24 బిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు స్విస్ అధికారులు వాషింగ్టన్‌తో చర్చలు జరుపుతున్నారు.

ఈ ప్రభావం భారతదేశంపైన కూడా..
ప్రతిపాదిత మినహాయింపు వార్తలు బయటకు వచ్చిన వెంటనే, US బంగారు ఫ్యూచర్లు ఔన్సుకు 3534.10 డాలర్ కంటే తక్కువగా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా..బంగారు కడ్డీలు, ఇతర ప్రత్యేక ఉత్పత్తులపై సుంకాల విధానాన్ని స్పష్టం చేసేందుకు తాజా కార్యనిర్వాహక ఉత్తర్వును సిద్ధం చేస్తోంది. మార్కెట్‌లో ఉన్న అనిశ్చితి తగ్గిపోతుందనే అంచనాలతో బంగారం ట్రేడర్లు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రపంచ మార్కెట్‌లో చెలరేగిన ఈ ప్రభావం భారతదేశంపైన కూడా పడింది. ఈ మధ్య కాలంలో ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు.. US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోత అంచనాల నేపథ్యంలో.. దేశీయ బంగారం ధరలు లక్ష రూపాయల మార్కును దాటాయి.

ఆర్థిక విశ్లేషకుల ప్రకారం..

దేశంలో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1 లక్ష దాటింది. ఈ పెరుగుదల.. పెట్టుబడిదారులలో బంగారం పట్ల ఆసక్తిని మరింతగా పెంచుతోంది. సామాన్యులకు ఇది భారాన్ని మిగిలిస్తోంది. ఆర్థిక విశ్లేషకుల ప్రకారం.. అమెరికా సుంక మినహాయింపు నిర్ణయం కనుక తుది రూపం దాల్చితే.. ప్రపంచ వ్యాప్తంగా బంగారం వాణిజ్యం మళ్లీ స్థిరపడే అవకాశం ఉంది. అయితే.. ఇదొక్కటే కాకుండా.. భవిష్యత్ ధరలు ప్రపంచ రాజకీయ పరిణామాలు, వడ్డీ రేటు మార్పులు, పెట్టుబడి డిమాండ్‌పై కూడా ఆధారపడి ఉంటాయి.

డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

ఏ బంగారం ఉత్తమం, 22K లేదా 916?
హాల్‌మార్క్ చేసిన బంగారం, KDM మరియు 916 బంగారం మధ్య వ్యత్యాసం - బజాజ్ ...
916 బంగారం, 22 క్యారెట్ బంగారం అని కూడా పిలుస్తారు, ఇది భారతదేశంలో ఆభరణాలకు విస్తృతంగా ఇష్టపడే ఎంపిక. ఇందులో 91.6% స్వచ్ఛమైన బంగారం మరియు 8.4% ఇతర మిశ్రమాలు ఉంటాయి.
24 క్యారెట్ల బంగారం హాల్‌మార్క్ అవలోకనం
హాల్‌మార్క్ అనేది బంగారం యొక్క స్వచ్ఛత మరియు చక్కదనాన్ని సూచించే చిహ్నం లేదా స్టాంప్. , బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు మరియు సాధారణంగా బంగారు వస్తువుపై ఉన్న హాల్‌మార్క్ ద్వారా సూచించబడుతుంది. బంగారం యొక్క స్వచ్ఛత ...
స్వచ్ఛతను ధృవీకరించే ప్రక్రియ
అవును, 24 క్యారెట్ల బంగారం హాల్‌మార్క్ కావచ్చు. హాల్‌మార్కింగ్ అనేది బంగారం యొక్క స్వచ్ఛతను ధృవీకరించే ప్రక్రియ, మరియు ఇది 24 క్యారెట్ల (ఇది 99.9% స్వచ్ఛమైనది)తో సహా వివిధ రకాల బంగారంపై వర్తించబడుతుంది. భారతదేశంలో, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ధృవీకరించే సంస్థ, మరియు వారు 24 క్యారెట్లతో సహా అన్ని స్వచ్ఛతల బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను కోరుతారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/general-elections-when-are-the-general-elections-in-bangladesh/international/528411/

America International Relations Latest News Breaking News Politics Switzerland Telugu News trump US News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.