Swiggy: స్విగ్గీకి రూ.158 కోట్ల జీఎస్టీ నోటీసులు

Read Time:  1 min
Swiggy gets Rs. 158 crore GST notices
Swiggy gets Rs. 158 crore GST notices
FONT SIZE
GET APP

Swiggy: ఆదాయపు పన్ను శాఖ నుంచి ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీకి నోటీసులు అందాయి. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుకు సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ ఈ నోటీసులు వచ్చాయి. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. మొత్తం రూ.158.25 కోట్ల పన్ను చెల్లించాలని ఆదేశాలు వచ్చినట్లు పేర్కొంది.

స్విగ్గీకి రూ.158 కోట్ల జీఎస్టీ

తమకు నోటీసులు అందాయంటూ స్విగ్గీ

2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి మధ్యకాలంలో డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ బకాయిలు రూ.158.27 కోట్లుగా పేర్కొంటూ తమకు నోటీసులు అందాయంటూ స్విగ్గీ పేర్కొంది. అయితే దీనిపై తాము సంబంధిత అధికారుల ముందు అప్పీల్‌ చేయనున్నట్లు తెలిపింది. ఆదాయపన్ను శాఖ నుంచి వచ్చిన ఆదేశాలు తమ ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్విగ్గీ షేర్లు రాణిస్తున్నాయి. 10:40 గంటల సమయంలో షేర్లు 2.80 శాతం లాభంతో రూ.340.85 వద్ద ట్రేడవుతున్నాయి. కాగా, స్విగ్గీకి గతంలోనూ ఇలాంటి జీఎస్టీ బకాయిలకు సంబంధించిన నోటీసులు జారీ అయిన విషయం గమనార్హం.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.