📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Swathi Varma: ఐర్లాండ్‌లో భారత యువతిపై దాడి

Author Icon By Anusha
Updated: October 11, 2025 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐర్లాండ్ (Ireland) రాజధాని డబ్లిన్‌లో భారత యువతి స్వాతి వర్మ (Swathi Varma) కు ఎదురైన భయానక సంఘటన ఇటీవల దేశ-విదేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అక్టోబర్ 8న జిమ్ నుంచి ఇంటికి తిరిగి నడిచే సమయంలో ఆమెపై గుర్తు తెలియని మహిళ అనూహ్యంగా దూషణలు, జాత్యాహంకార వ్యాఖ్యలు చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో, విస్తృతంగా చర్చలకు, విమర్శలకు మారింది.

Explosion: అమెరికా నగరంలో భారీ పేలుడు

తన ఇన్‌స్టాలో వీడియోను పోస్ట్ చేసిన స్వాతి (Swathi Varma).. ‘‘నేను ప్రతిరోజూ నడుచుకుంటే వెల్లే వీధిలో నా అస్థిత్వం, ఉనికి నిరూపించుకోవాల్సిన అవసరం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు.. నా జిమ్ వెలుపల ఓ మహిళ నన్ను ఆపి ఎందుకు ఐర్లాండ్‌లో ఉన్నావని అడిగి, భారత్‌కు వెళ్లిపో అని చెప్పింది.. ఆమె అలా అనేసరికి కొన్ని సెకెన్లు నేను షాక్‌లో నిలబడిపోయాను..

తర్వాత నాను నేనుగా సర్దిచెప్పుకున్నాను.. ఆమె మాటలను రికార్డు చేసి, ఎందుకు షేర్ చేశానంటే జాతి వివక్ష, భయపెట్టడం, ద్వేషం ఇంకా మన వీధులలో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇలా ఎవరికీ జరగకూడదు’’ అని శ్వేత తెలిపారు.

View this post on Instagram

A post shared by Swati Verma (@swatayva)

మానసిక అనారోగ్యంతో ఉన్నట్టు కనిపిస్తుంది

‘ఆమెను చూస్తే మానసిక అనారోగ్యంతో ఉన్నట్టు కనిపిస్తుంది.. ఆమెకు సహాయం అవసరమైతే అందించడానికి, నేను దీన్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ‘నా జిమ్ సెషన్ ముగిసిన తర్వాత గత రాత్రి దాదాపు 9 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగొస్తున్నాను..

నేను ఉంటున్న ఇంటికి కొద్ది అడుగుల దూరంలో ఉండగా రోడ్డు దాటుకుంటూ వచ్చిన ఓ మహిళ నన్ను పిలిచి ఆగమని చెప్పింది..ఆమె దారితప్పిపోయిందేమో అనుకున్నాను. కానీ ఆమె నా దగ్గరికి వచ్చిన వెంటనే, ఆమె మాటలలో మార్పు వచ్చింది. అహంకారమైన నవ్వుతో ‘‘నీవు ఐర్లాండ్‌కు ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏమి చేస్తున్నారు? భారతదేశానికి తిరిగి ఎందుకు వెళ్ళవు?’’ అడిగింది.

ఆమెకు మద్దతుగా పోస్ట్‌లు

షాక్‌లో నేను శాంతంగా ఉండడానికి ప్రయత్నించి నేను ఇక్కడ పని చేస్తాను, ఇక్కడ ఉండటం ఇష్టం’ అని చెప్పాను’ అని తెలిపింది.ఆమె మరింత దగ్గరికి వచ్చి ‘నీ వద్ద వీసా ఉందా? ఇల్లు అద్దెకు తీసుకున్నానా లేదా సొంతదా? ఇంకా భారత్‌ ప్రజలకు స్వేచ్ఛ ఇస్తుందా? అని ప్రశ్నించింది’ అని స్వాతి (Swathi Varma) వివరించారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు.. ఆమెకు మద్దతుగా పోస్ట్‌లు పెడుతున్నారు. మీకు ఎదురైన అనుభవానికి చింతిస్తున్నామని, మీ అస్థిత్వం గురించి ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు. అయితే, ఐర్లాండ్‌లో ఇంతకు ముందు కూడా భారతీయులకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Dublin incident Ireland news latest news Swathi Varma Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.