📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Supreme Court- పాపం.. బోలొ నారో కి తప్పని శిక్ష

Author Icon By Anusha
Updated: September 12, 2025 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అధికారం, పదవిలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పులు చేసినా పర్వాలేదనుకుంటారు. అవినీతి (Corruption) కార్యక్రమాలకు పాల్పడినా ఏమాత్రం తప్పు చేస్తున్నామనే భావన ఉండదు. కానీ ఆ పదవికాలం అయిపోయిన తర్వాత అప్పుడు తాము చేసిన అక్రమాలకు పశ్చాతాప్తం చెందుతుంటారు. సరిగ్గా ఈ మాటలు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో (Jair Bolsonaro) కి సరిపోతాయి. ఆయన చేసిన తప్పిదాలకు ఏకంగా 27 ఏళ్ల జైలుశిక్షను అనుభవించాల్సి రావడం ఆవేదన కలిగించే విషయం.

సైనిక కుట్ర కేసులో ఆయనకు ఆ దేశ సుప్రీంకోర్టు (Supreme Court) 27 ఏళ్ల 3నెలల జైలు శిక్షను విధించింది. 2022 ఎన్నికల్లో వామపక్ష నేత టూయిజ్ ఇనాసియో లూలా డాసెల్లా చేతిలో బోల్సొనా ఓడిపోయారు. అయినా కూడా అధికారాన్ని దక్కించుకునేందుకు ఆయన సైనిక కుట్రకు పాల్పడినట్లు నిర్ధారణఅయ్యింది. దీంతో సుప్రీంకోర్టులో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ప్యానల్ ఈ జైలుశిక్ష విధించింది.ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నిన కేసులో జైలుశిక్ష పడ్డ మొదటి,మాజీ అధ్యక్షుడిగా బోలొ నారో నిలవడం గమనార్హం.

విధ్వంసానికి పాల్పడ్డ జైర్ మద్దతుదారులు

జైర్ బోలొ నారో ఇంతపెద్ద శిక్షపడేందుకు అసలు కారణాలు ఏమిటి అనే వివరాల్లోకి వెళ్తే.. 2022 ఎన్నికల్లో బోలొ నారో (Bolo Naro) ఓడిపోయారు. అయితే ఆయనమద్దతుదారులు రాజధాని బ్రసీలియాలో అల్లర్లకు పాల్పడ్డారు. అంతటితో ఆగక దేశ అధ్యక్షుడి అధికారిక నివవాసం, సుప్రీంకోర్టు, పార్లమెంటు భవనాల్లోకి చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారు. లూలా డా సిల్లా గద్దె దింపాలంటూ నినాదాలు చేశారు.

Supreme Court

బోల్సొ నారో నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం,చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు బోల్సొ నారో కూడా తన మద్దతుదారులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ‘అధికారం మీ చేతుల్లో ఉంది. సైన్యం (the army) మా మాట వింటుంది. దొంగల పాలనను కూల్చేయండంటూ’ పిలుపునిచ్చారు. లూలా డిసిల్వా ఎన్నికల్లో ప్రజల ఓట్ల వల్ల తెలవలేదని.. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం (Election Commission) వల్లే గెలిచాడంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆయన మద్దతుదారులు ఆందోళనలకు దిగారు.

సైనిక కుట్రకు పాల్పడ్డ జైర్

ప్రాసిక్యూటర్ జనరల్ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు బోలొ నారోతో సహా మరో 33 మందిపై విచారణకు పర్మిషన్ ఇచ్చింది. చివరికి బోల్సొనారో సైనిక కుట్రకు పాల్పడ్డట్టు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆయనకు 27 ఏళ్ల 3నెలల జైలుశిక్ష విధించింది. అయితే ట్రంప్ ఈ తీర్పును తీవ్రంగా ఖండించారు. అయితే ప్రస్తుతం బ్రెజిల్ అధ్యక్షుడిగా ఉన్న లాలూ ద సిల్లా ట్రంప్ల మధ్య ట్రేడ్ వార్ నడుస్తున్నది.

బ్రెజిల్ పై ట్రంప్ 50శాతం టారీఫ్లను విధించారు. దీన్ని ఆదేశం తీవ్రంగానే స్పందించింది. ‘టారిఫ్ బ్లాక్మెయిల్’ అంటూ సిల్వా ధ్వజమెత్తారు. ఏదిఏమైనా ఒక మాజీ అధ్యక్షుడు 27 సంవత్సరాల జైలు శిక్షను భరించడం తీవ్ర ఆవేదన కలిగించే తీర్పుగా ఆయన కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు. బోలొ నారో మద్దతుదారులు కూడా ఈ తీర్పుసరైంది కాదని అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పును మరోసారి పునఃపరిశీలన చేయాలని కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/crime-in-usa-baboy-brutal-murder-of-an-indian-in-america/international/545751/

2022 elections Brazil Breaking News government overthrow attempt Jail sentence Jair Bolsonaro latest news leftist leader Lula da Silva military coup plot political conspiracy Supreme Court Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.