కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్య నిధి (EPF) పరిధిలోకి మరింత మంది ఉద్యోగులను తీసుకురావడం లక్ష్యంగా “ఎంప్లాయీస్ ఎన్‌రోల్‌మెంట్ స్కీమ్ 2025” అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ నవంబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది.
Read Also: Taliban: భారత్‌లో తాలిబన్ తొలి దౌత్యవేత్త నియామకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఈ పథకం ద్వారా సంఘటిత రంగంలో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులను EPF పరిధిలోకి తీసుకురావడం, వారికి సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం. కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి మాన్సుఖ్ మాండవీయా ఈ స్కీమ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు.
ఈ పథకం కింద, కంపెనీలు తమ ఉద్యోగులను EPFOలో స్వచ్ఛందంగా నమోదు చేయవచ్చు. గతంలో ఉద్యోగి వాటా (employee share) చెల్లించకపోయినా, పాత బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా రూ.100 నామమాత్రపు పెనాల్టీ కడితే సరిపోతుంది.
స్కీమ్ కాలపరిమితి
- ప్రారంభం: నవంబర్ 1, 2025
- ముగింపు: ఏప్రిల్ 30, 2026
- అర్హులైన ఉద్యోగులు: 2017 జూలై 1 నుండి 2025 అక్టోబర్ 31 మధ్య ఉద్యోగంలో చేరి, ఇప్పటివరకు EPF కవరేజీ లేని వారు.
పథకం ప్రయోజనాలు
- EPF కవరేజ్ లేని ఉద్యోగులకు సామాజిక రక్షణ
- సంస్థలకు సులభతర నమోదు ప్రక్రియ
- పాత లోపాలను సరిదిద్దుకునే అవకాశం
- పారదర్శకత, సామర్థ్యం, సమానత్వం కలిగిన సిస్టమ్ ఏర్పాటు
EPFO: కార్మికుల నమ్మకానికి ప్రతీక
మంత్రి మాండవీయా మాట్లాడుతూ, “EPFO కేవలం ఒక నిధి మాత్రమే కాదు, ఇది భారతీయ కార్మికులకు ఆర్థిక భద్రతా చిహ్నం. ఇందులో జరుగుతున్న మార్పులు పారదర్శకత, సామర్థ్యం, సమానభావం ఆధారంగా కొనసాగుతున్నాయి,” అని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: