📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్ రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం వైద్య సిబ్బంది నియామకం బంగారం ధర షాక్! తెలంగాణకు భారీ పెట్టుబడులు అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? ట్రంప్ టారిఫ్‌లు రద్దు ట్రంప్ వార్నింగ్ బ్యాంకులు బంద్ టీమిండియా ఘన విజయం 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు బస్సులో హఠాత్తుగా పొగలు చంద్రుడిపై హోటల్

Super Moon 2026: రేపు తొలి పౌర్ణమి

Author Icon By Anusha
Updated: January 2, 2026 • 5:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ ఏడాది తొలి పౌర్ణమి సూపర్ మూన్ (Super Moon 2026) (రేపు) శనివారం కనువిందు చేయనుంది. జనవరి 3న సాయంత్రం 6 గంటలకు చంద్రుడు మరింత పెద్దగా కనిపించనున్నాడు.. 15% పెద్దగా, 30% ప్రకాశవంతంగా చంద్రుడు కనిపిస్తాడు. ఈ అద్భుత దృశ్యాన్ని నేరుగా చూడవచ్చు. సూపర్ మూన్‌ (Super Moon 2026) ను చూడటానికి ఇప్పుడు మిస్ అయితే నవంబర్ వరకు ఆగాల్సిందే.చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల సూపర్ మూన్ ఏర్పడుతుంది. చంద్రుడి కక్ష్య వృత్తాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది.

Read also: Gambia: పడవ బోల్తా.. ఏడుగురు మృతి

పౌర్ణమి రోజు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉంటాడు

దీంతో కొన్ని సమయాల్లో చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. కొన్ని సమయాల్లో భూమికి దగ్గరగా (పెరిజీ), మరికొన్ని సమయాల్లో దూరంగా (అపోజీ) ఉంటాడు. పౌర్ణమి రోజు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు కనిపించేదే సూపర్‌మూన్‌గా వ్యవరిస్తుంటాం. జనవరి 3న చంద్రుడు భూమికి సుమారుగా 3,56,500 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు.దీని వల్ల సాధారణం కన్నా 14శాతం పెద్దగా, 30శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు.

Super Moon: First full moon tomorrow

భూమి, చంద్రుడి మధ్య సరాసరి దూరం సుమారు 3,84,400 కిలోమీటర్లు. పెరీజీ సమయంలో 3,56,500 కిలోమీటర్లు, అపోజీ సమయంలో 4,06,700 కిలోమీటర్లు దూరం ఉంటుంది.2026లో జరిగే సంఘటనకు మరో ప్రత్యేకత ఉంది. ఇది పెరిహెలియన్, అంటే భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే బిందువుతో ఏకీభిస్తుంది. ఈ సమయంలో పెరిజియన్ స్ప్రింగ్ అలలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. తీర ప్రాంతాల్లోని ప్రజలు సముద్ర అలలు పెద్దవిగా ఉండటం గమనించవచ్చు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Full Moon January Supermoon latest news Super Moon Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.