ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఓటమిని తప్పించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌లో జరుగుతున్న పరిణామాలపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, టీమిండియాలో వరుసగా నమోదవుతున్న పరాజయాలకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) నే బాధ్యుడిగా పేర్కొన్నారు. గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత జట్టు పేలవంగా ప్రదర్శించడంపై గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రస్తుతం భారత క్రికెట్‌పై అతనే పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నాడని, జట్టు పేలవ ప్రదర్శన క్రెడిట్ కూడా అతనిదేనని తెలిపాడు. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్ వెనుక కూడా గంభీర్ ఉన్నాడని పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఓటమి తప్పించుకునేందుకు పోరాడుతోంది. నాలుగో రోజు ఆట అనంతరం సోనీ స్పోర్ట్స్ (Sony Sports) తో మాట్లాడిన గవాస్కర్ తుది జట్టు ఎంపికలో గంభీర్ జోక్యం ఎక్కువైందని ఆరోపించాడు.
లంచ్ బ్రేక్ తర్వాత సలహాలు కూడా ఇస్తుంటారు
గంభీర్ దగ్గరకు వెళ్లి శుభ్‌మన్ గిల్ తన జట్టు అని చెప్పగలడా? అని హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నకు (Sunil Gavaskar) గవాస్కర్ బదులిచ్చాడు.మనకు కోచ్‌లు ఎవరూ లేరు. కేవలం మాజీ ఆటగాళ్లు జట్టుకు మేనేజర్లుగా, అసిస్టెంట్ మేజర్లుగా మాత్రమే ఉన్నారు. అలాంటి వారి వద్దకు వెళ్లి మాట్లాడొచ్చు. లంచ్ బ్రేక్ తర్వాత సలహాలు కూడా ఇస్తుంటారు. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు మా జట్టుతో మాజీ ఆటగాళ్లు ఎవరూ లేరు. మాక్ వింగ్ కమాండర్ దుర్రానీ, రాజ్ సింగ్ దుంగార్క్‌పూర్ మాత్రమే ఉన్నారు. ఎర్రవల్లి ప్రసన్న కొద్ది రోజులు జట్టుతో కొనసాగారు. ఎవరున్నా తుది జట్టులో కెప్టెన్‌దే తుది నిర్ణయం అవుతుంది. తన టీమ్‌లో కుల్దీప్ ఉండాలా? శార్దూల్ ఉండాలా అనేది కెప్టెన్ చూసుకుంటాడు.జట్టులో ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు? అనేది కెప్టెన్ నిర్ణయం. ఏం జరిగినా అతనిదే పూర్తి బాధ్యత.
తుది జట్టు ఎంపికలో కోచ్‌ల జోక్యం
అయితే శార్దూల్‌కు బదులు కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని శుభ్‌మన్ గిల్ అనుకోవచ్చు. తుది జట్టు ఎంపికలో కోచ్‌ల జోక్యం ఏ మాత్రం ఉండదు. గంగూలీ భారత క్రికెట్‌లో ఓ విప్లవాన్ని తీసుకొచ్చాడు. ధోనీ తనకు కావాల్సిన ఆటగాళ్లను ఎంచుకున్నాడు. కానీ ప్రస్తుతం భారత క్రికెట్ పరిస్థితి గతంలోలా లేదు. బీసీసీఐ నుంచి గంభీర్ తనకు కావాల్సినవన్నీ తీసుకున్నాడు. కేకేఆర్ స్టాఫ్‌ను తనతో పాటు టీమిండియాలోకి తీసుకొచ్చాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వెనుక కూడా గంభీర్ పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కెప్టెన్ కంటే తన వద్దే ఎక్కువ పవర్ ఉండాలని గంభీర్ అనుకున్నట్లు అనిపిస్తోంది. కాబట్టి జట్టు పేలవ ప్రదర్శన క్రెడిట్ కూడా అతనికే దక్కుతుంది.’అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
సునీల్ గవాస్కర్ ఫేవరెట్ షాట్?
అతని కెరీర్ మొత్తంలో అతనికి ఇష్టమైన షాట్ ఏంటని అడిగినప్పుడు “ఇది స్పష్టంగా స్ట్రెయిట్ డ్రైవ్, ఎందుకంటే నువ్వు బ్యాట్ ని స్ట్రెయిట్ గా ప్రజంట్ చేస్తున్నావు, కష్టమైన షాట్ అని ఏమీ లేదు, ప్రతి బ్యాట్స్ మాన్ తన షాట్ సెలక్షన్ ని ఎలా సెట్ చేసుకుంటాడో అదే అన్నాడు.
బోర్డర్ గవాస్కర్ అని ఎందుకు పిలుస్తారు?
బోర్డర్,గవాస్కర్ ట్రోఫీ (వ్యావహారికంగా BGT అని పిలుస్తారు) అనేది భారతదేశం ,ఆస్ట్రేలియా మధ్య జరిగే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్‌షిప్. ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు, అలన్ బోర్డర్, భారతదేశానికి చెందిన సునీల్ గవాస్కర్ పేరు పెట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Kapil Dev: అన్షుల్ కంబోజ్‌కు అండగా నిలిచిన కపిల్ దేవ్