Sundar Pichai AI statement : అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ Anthropic ఇటీవల విడుదల చేసిన కొత్త ఏఐ టూల్ టెక్ ప్రపంచంలో చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో Google సీఈఓ Sundar Pichai తొలిసారిగా స్పందించారు. ఆంథ్రోపిక్ ఏఐపై అనవసర భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. గూగుల్ సెర్చ్, యూట్యూబ్ లాగానే ఏఐ కూడా ఒక సహాయక టూల్ మాత్రమేనని చెప్పారు.
ఏఐ టెక్నాలజీ ఉద్యోగాలను లేదా సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను పూర్తిగా భర్తీ చేయదని, వాటి సామర్థ్యాన్ని పెంచే సాధనంగా మాత్రమే పనిచేస్తుందని సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకుంటే కంపెనీలకు ఇది మరిన్ని అవకాశాలు తీసుకువస్తుందని చెప్పారు. అందువల్ల ఏఐ పురోగతిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇదే అభిప్రాయాన్ని NVIDIA సీఈఓ Jensen Huang కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను ఏఐ మరింత శక్తివంతం చేస్తుందని, కానీ వాటిని పూర్తిగా భర్తీ చేయదని చెప్పారు. క్లిష్టమైన పనులను వేగంగా పూర్తిచేయడానికి ఉద్యోగులు ఏఐని వినియోగించుకోవచ్చని తెలిపారు.
Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం
అయితే ఆంథ్రోపిక్ విడుదల చేసిన కొత్త ఏఐ టూల్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్, లీగల్ టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల షేర్లు పడిపోయాయి. ఒక్క ట్రేడింగ్ సెషన్‌లోనే ఈ రంగాల్లో సుమారు 285 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఆంథ్రోపిక్ ఇటీవల విడుదల చేసిన ‘క్లాడ్ ఓపస్ 4.6’ మోడల్ టెక్ వర్గాల్లో ఆసక్తి రేపింది. 16 ఏఐ ఏజెంట్లు కలిసి ‘సీ కంపైలర్’ అభివృద్ధిపై ప్రయోగాలు జరిపి, కేవలం రెండు రోజుల్లో లక్ష లైన్ల కంపైలర్‌ను రూపొందించగలిగినట్లు సంస్థ తెలిపింది. సాధారణంగా అత్యంత క్లిష్టంగా భావించే ఈ ప్రక్రియను ఏఐ స్వయంగా పూర్తి చేయడం టెక్ రంగంలో కీలక మైలురాయిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: