Subko Coffee funding : ముంబైకి చెందిన ప్రముఖ స్పెషాలిటీ కాఫీ బ్రాండ్ Subko Coffee అంతర్జాతీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. తాజాగా దుబాయ్‌లో తన తొలి అంతర్జాతీయ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించిన సబ్కో, అదే సమయంలో భారీగా ఫండింగ్‌ను కూడా సమీకరించింది. ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ Zerodha సహ-వ్యవస్థాపకుడు Nikhil Kamath నేతృత్వంలో 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.90 కోట్లు) పెట్టుబడి అందుకుంది.
ఈ ఫండింగ్ రౌండ్‌లో నిఖిల్ కామత్‌తో పాటు నటుడు జాన్ అబ్రహం, గౌరీ ఖాన్ ఫ్యామిలీ ట్రస్ట్ కూడా భాగస్వాములయ్యారు. తాజా పెట్టుబడులతో సబ్కో మొత్తం కంపెనీ విలువ సుమారు 34 మిలియన్ డాలర్లకు చేరినట్లు సమాచారం. ఈ నిధులను టాలెంట్ పూల్ విస్తరణ, టెక్నాలజీ ఆధారిత కస్టమర్ అనుభూతి మెరుగుదల, కొత్త ఉత్పత్తుల పరిశోధన & అభివృద్ధి (R&D) కోసం వినియోగించనున్నారు.
Read also: Gudimalkapur: తెలంగాణలో నకిలీ నోట్లు స్వాధీనం .. ముగ్గురు అరెస్టు
అలాగే స్పెషాలిటీ గ్రీన్ కాఫీ, ఫైన్ కాకావ్ బీన్స్ కోసం వ్యవసాయ స్థాయిలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ‘రెడీ టు డ్రింక్’ కాఫీ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడం వంటి వ్యూహాత్మక ప్రణాళికలు సబ్కో ముందుంచింది.
సబ్కోను 2020లో రాహుల్ రెడ్డి స్థాపించారు. భారత ఉపఖండానికి చెందిన స్పెషాలిటీ కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఈ బ్రాండ్ ప్రయాణం ప్రారంభమైంది. ముంబై బాంద్రాలోని 1925 నాటి వారసత్వ గోవా బంగ్లాలో (Subko Coffee funding) మొదటి అవుట్‌లెట్ ప్రారంభించి, అనంతరం బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
ఇటీవల దుబాయ్‌లోని Alserkal Avenue లో 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తొలి అంతర్జాతీయ స్టోర్‌ను ప్రారంభించింది. ఇందులో స్పెషాలిటీ కేఫ్, ప్రత్యేక కోకోవా రూమ్, ఆర్టిసనల్ బేక్‌హౌస్ ఏర్పాటు చేశారు. సబ్కోపై స్పందించిన నిఖిల్ కామత్—“ఇది స్టార్‌బక్స్ కంటే కూడా మెరుగైన అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ కాఫీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది” అని ప్రశంసించారు. భారతీయ బ్రాండ్లు ఇప్పుడు గ్లోబల్ ప్రీమియం మార్కెట్‌లో రాణిస్తున్నాయనడానికి సబ్కో దుబాయ్ స్టోర్ ఓ మంచి ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: