📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

Shubhanshu Shukla : శుభాన్షు శుక్లా రోదసి యాత్రకు రంగం సిద్ధం

Author Icon By Sudha
Updated: June 9, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రకు (ISS) రంగం సిద్ధమైంది.
అమెరికా ప్రైవేట్‌ స్పేస్‌ సంస్థ ‘యాక్సియమ్‌’ (Axiom Space) చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్‌-4’ మిషన్‌లో భాగంగా రేపు (మంగళవారం) ఆయన నింగిలోకి దూసుకెళ్లనున్నారు. స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ (SpaceX Falcon 9 rocket) ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. తద్వారా రోదసి యాత్ర చేపట్టిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఇంతకుముందు రాకేశ్‌ శర్మ, రష్యా సహకారంతో అంతరిక్షయానం చేసిన సంగతి తెలిసిందే.

Shubhanshu Shukla : శుభాన్షు శుక్లా రోదసి యాత్రకు రంగం సిద్ధం

కెన్నెడీ స్పేస్ సెంటర్
ఈ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష యాత్ర భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:52 గంటలకు ప్రారంభం కానుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్‌, పోలండ్‌, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (International Space Station) పంపుతున్నారు. ఈ మిషన్‌కు శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) పైలట్‌గా వ్యవహరించబోతున్నారు.
చరిత్రకెక్కనున్నారు
భారత్‌కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్‌ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకోనున్నారు. ‘స్పేస్‌ఎక్స్‌’ సంస్థకు చెందిన ‘డ్రాగన్‌’ వ్యోమనౌక ద్వారా శుభాంశు శుక్లా ఐఎస్‌ఎస్‌కు చేరుకోనున్నారు. దీంతో ప్రైవేట్‌ రోదసి యాత్ర ద్వారా ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రకెక్కనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్‌ఎస్‌లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. పైలట్‌గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
నిజానికి మే 29నే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా వాయిదా పడింది. తొలుత ఈ ప్రయోగాన్ని జూన్ 8వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత ఈ ప్రయోగం రేపటికి వాయిదా పడింది. ప్రయోగానికి ముందు సన్నాహాల్లో గుర్తించిన చిన్న సాంకేతిక సమస్య కారణం మిషన్‌ను వాయిదా వేసినట్లు అమెరికాకు చెందిన వాణిజ్య మానవ సహిత అంతరిక్షయాన సంస్థ యాక్సియమ్ స్పేస్ (Axiom Space), నాసా (NASA) సంయుక్తంగా ప్రకటించాయి.

Read Also:Yunus: వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు: యూనస్

Breaking News in Telugu Google news Google News in Telugu is all set for the Latest News in Telugu Paper Telugu News Rodasi Yatra Subhanshu Shukla Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.