📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Teacher: 2 మార్కులు తక్కువ వేసిందని టీచర్‌పై విద్యార్థి దాడి

Author Icon By Vanipushpa
Updated: August 13, 2025 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గురువంటే విద్యార్థికి మార్గదర్శకుడు. తల్లిదండ్రి తర్వాత అంతటి స్థానం గురువుకే సొంతం. అలాంటి గురువుకు ఏమిచ్చిన రుణం తీరదు. ఒకప్పుడు టీచర్‌ అంటే ఎనలేని గౌరవం ఉండేది. దూరంగా టీచర్‌ కనిపించారంటే భయంతో దాక్కూనేవారు. కానీ, కాలం మారింది. టీచర్‌ అంటే గౌరవం ఇవ్వకపోగా వారిపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తుస్తూ విద్యావ్యవస్థకే కళంకంగా మారుతున్నారు. రెండు మార్కులు తక్కువ వేసిందని టీచర్‌పైనే దారుణానికి ఒడిగట్టాడో ప్రభుద్ధుడు. కోపంతో ఆమెపై క్లాస్‌ రూములోనే విచక్షణా రహితంగా దాడి చేశాడు. 20 మార్కులకు గాను 18 మార్కులు వేసినప్పటికీ ఆ యువకుడికి సంతోషం అనిపించలేదు. తనకు వచ్చిన మార్కులతో సంతృప్తి చెందలేదు. తనకు మార్కులు రావడానికి కారణాలను అన్వేషించకుండా రెండు మార్కుల కోసం లెక్కల టీచర్‌తో గొడవ పెట్టుకోవడమే కాకుండా ఆమెను కొట్టాడు. ఈ సంఘటన థాయ్‌లాండ్‌ (Thailand) దేశంలో ఆలస్యంగా వెలుగు చూసింది.

మార్కులు తక్కువ వేసిందని టీచర్‌పై విద్యార్థి దాడి

విద్యార్థి ఆర్టీపై విచక్షణ రహితంగా దాడి

ఉతాయ్ థానీ ప్రాంతానికి చెందిన ఆర్టీ(Artti) అనే మహిళ ఓ స్కూల్లో లెక్కల టీచర్‌గా పని చేస్తోంది. ఆగస్టు 5న స్కూల్లో నిర్వహించిన మిడ్ టర్మ్ మ్యాథ్స్ ఎగ్జామ్(Maths Exams) ఫలితాలను ప్రకటించింది. అందులో భాగంగా ఓ విద్యార్థికి 20 మార్కుకు గాను 18 మార్కులు వచ్చాయి. ఆ మార్కులతో అతడు సంతృప్తి చెందలేదు. తనకు కావాలనే మార్కులు తక్కువ వేశారని ఆవేదనతో నేరుగా ఆర్టీ దగ్గరకు వెళ్లాడు. తనకు ఎందుకు ఆ రెండు మార్కులు వేయలేదని ఆమెను నిలదీశాడు. ఆమె ఏదో సర్ధిచెప్పిన వినలేదు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. దీంతో రెచ్చిపోయిన విద్యార్థి ఆర్టీపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. గొడవ జరుగుతున్న విషయం తెలిసి పక్క క్లాసులో ఉన్న ఓ మగ టీచర్ అక్కడికి వచ్చాడు. ఆమెపై దాడి చేస్తున్న విద్యార్థిని నిలువరించాడు. అప్పటికే ఆర్టీ కళ్లు, తల, రిబ్స్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

సీసీటీవీ కెమెరాలో రికార్డు

అయితే ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు క్లాస్ రూములో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ సీసీటీవీ దృశ్యాలకు సంబంధించిన వీడియోను ఆర్టీ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది. ‘ నా పై అనవసరంగా దాడిచేసిన ఆ యువకుడిని వదిలిపెట్టను. చట్టపరంగా పోరాటం చేస్తాను. అత్యంత కఠినమైన చర్యలు తీసుకునేలా చేస్తాను’ అని అంటూ ఆ పోస్టులో రాసింది. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై పలువురు నెటిజన్లు స్పందించారు.  ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువుకు గౌరవం ఇవ్వలేని ఆ విద్యార్థి పై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాంటి వారికి సరైన విధంగా బుద్ధి చెప్పాలని అంటున్నారు.

థాయిలాండ్ పేరు ఏమిటి?
థాయిలాండ్, ఇండోచైనీస్ ద్వీపకల్పంలోని ఆగ్నేయాసియాలోని ఒక దేశం. ఇది అధికారికంగా థాయిలాండ్ రాజ్యం మరియు చారిత్రాత్మకంగా సియామ్ అని పిలువబడింది, 1939 వరకు అధికారిక పేరు.

థాయిలాండ్ ఎలా ప్రసిద్ధి చెందింది?
'స్మైల్స్ భూమి' దాని అద్భుతమైన బీచ్‌లు, అద్భుతమైన ఆహారం మరియు అందమైన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది, అయితే ఇది దాని బురదమయమైన అండర్‌బెల్లీ మరియు అస్తవ్యస్తమైన రోడ్లకు కూడా ఖ్యాతిని కలిగి ఉంది.

Read also hindivaartha.com

Read more :

https://vaartha.com/elon-musk-issues-strong-warnings-to-apple/business/529360/

Education News Exam Marks Dispute Latest News Breaking News School Violence Student Attack Teacher Assault Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.