ఎయిర్‌పోర్టుల్లో సమ్మె.. 3400 విమానాలు రద్దు !

Read Time:  1 min
Strike at German airports.. 3400 flights canceled!
Strike at German airports.. 3400 flights canceled!
FONT SIZE
GET APP

బెర్లిన్‌ : వేతనాలు పెంచాలని, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ … జర్మనీలోని విమానాశ్రయాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఫ్రాంక్‌ఫర్ట్‌, మ్యూనిక్‌ సహా ప్రధాన నగరాల్లోని ఎయిర్‌పోర్టుల్లో విమాన సర్వీసులపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడింది. కార్మికులు, ఉద్యోగుల సమ్మెతో వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. మొత్తంగా 5 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడనున్నట్లు అంచనా. ఒక్క ఫ్రాంక్‌ఫర్ట్‌ ఎయిర్‌పోర్టు నుంచి 1116 విమానాలు రాకపోకలు సాగిస్తుండగా ఇందులో 1054 సర్వీసులు రద్దయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఎయిర్‌ పోర్టుల్లో సమ్మె 3400

దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులపై సమ్మె

బెర్లిన్‌ నుంచి నడిచే విమానాలన్నీ ఆగిపోయాయి. హాంబర్గ్‌లోనూ అదే పరిస్థితి ఏర్పడింది. విమాన సర్వీసులు రద్దయినట్లు కొలోన్‌ ఎయిర్‌పోర్టు ప్రకటించగా, సమ్మె కారణంగా విమాన సర్వీసుల సంఖ్య భారీగా తగ్గినట్లు మ్యూనిక్‌ విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు తెలిపారు. మొత్తంగా 3400 విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉందని జర్మనీ ఎయిర్‌పోర్టు ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ అంచనా వేసింది. దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులపై సమ్మె ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. వేతనాలు పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తుండగా.. పని ప్రదేశంలో షరతులు సహా అదనపు సమయానికి ఎక్కువ మొత్తంలో బోనస్‌ ఇవ్వాలని కోరుతూ విమానాశ్రయాల్లో పనిచేసే సిబ్బంది, కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇటీవల జరిపిన చర్చలు విఫలం

అయితే, వారి డిమాండ్లను పరిష్కరించలేమంటూ ఆయా యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యోగ, కార్మిక సంఘాలు ఒకరోజు సమ్మెకు దిగాయి. ఈ నెల చివర్లో మరోసారి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యోగ, కార్మిక సంఘాలు ఒకరోజు సమ్మెకు దిగాయి. ఈ నెల చివర్లో మరోసారి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.