Strait of Hormuz: గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత మధ్య భారత ఇంధన భద్రతకు ఊరటనిచ్చే వార్త వెలువడింది. దేశీయ అవసరాల కోసం భారీ ఎత్తున ఎల్పీజీ (LPG) సరుకుతో వస్తున్న భారతీయ నౌక ‘నందా దేవి’ (Nanda Devi) వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. సుమారు 46,000 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో వస్తున్న ఈ నౌకకు భారత నావికాదళం (Indian Navy) ఎస్కార్ట్ కల్పిస్తోంది.
Read Also: CEO Julie: AI నేర్చుకోకపోతే ప్రమోషన్ లేదు.. ఉద్యోగం కూడా కష్టమే!

రెండు రోజుల్లో తీరానికి
ప్రస్తుతం బహిరంగ సముద్రంలోకి ప్రవేశించిన ఈ నౌక, మరో 48 గంటల్లో ముంబై లేదా గుజరాత్ లోని కాండ్లా ఓడరేవుకు చేరుకోనుంది. అంతకుముందు రోజునే ‘శివాలిక్’ (Shivalik) అనే మరో భారతీయ నౌక కూడా 40,000 టన్నుల ఎల్పీజీతో ఇదే మార్గం గుండా సురక్షితంగా బయటపడింది. గల్ఫ్ సంక్షోభం కారణంగా అనేక అంతర్జాతీయ నౌకల రాకపోకలు నిలిచిపోయినప్పటికీ, భారతీయ నౌకలకు మినహాయింపు లభించడం గమనార్హం.

దౌత్య విజయం:
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇరాన్ అధ్యక్షుడితో జరిపిన చర్చల ఫలితంగానే భారతీయ నౌకలకు ఈ ‘సేఫ్ పాసేజ్’ లభించినట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. యుద్ధ వాతావరణంలో కూడా గ్యాస్ సరఫరాకు ఆటంకం కలగకుండా ఇండియన్ నేవీ నిరంతరం పర్యవేక్షిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: