బ్రిటన్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు జీవితంలో మర్చిపోలేని ఒక వింత అనుభవం ఎదురైంది. తన కారును దొంగలు ఎత్తుకెళ్లాక చేసేదేమీ లేక మరో కొత్త కారును కొనాలని నిర్ణయించిన అతడు, తీరా చూస్తే మళ్లీ తన పోయిన కారునే కొనుగోలు చేసిన విచిత్రమైన సంఘటన జరిగింది. ఈ అరుదైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లోనే వైరల్ అయ్యింది.
బ్రిటన్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్ ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఈవాన్ వాలెంటైన్ ఇటీవల ఇలా ఓ అసాధారణ ఘటనను ఎదుర్కొన్నారు. ఆయనకి చెందిన నల్ల రంగు హోండా సివిక్ కారును ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటి ముందు పార్క్ చేసి ఉంచగా గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా, అధికారులు కారు తిరిగి దొరికే అవకాశాలు చాలా తక్కువ అని నిరాశ వ్యక్తం చేశారు. అయితే అదృష్టం కొద్దీ బీమా కంపెనీ నుండి పూర్తి పరిహారం అందింది. అందుకు కృతజ్ఞతతో, తనకు ఎంతో ఇష్టమైన అదే మోడల్, అదే రంగు హోండా సివిక్ కారును మళ్లీ కొనాలని ఈవాన్ నిర్ణయించుకున్నారు.
తిరిగి కనిపించిన తన ‘మునుపటి’ కారు
కొద్ది రోజుల తర్వాత ఆన్‌లైన్ కార్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌లో బ్రౌజ్ చేస్తుండగా, అచ్చం తన పాత కారులాంటి ఒక వాహనం కనిపించింది. రూపం, రంగు, మోడల్ అన్నీ కూడా ఏ మాత్రం తేడా లేకుండా ఉండటంతో ఆ వాహనాన్ని సుమారు రూ. 22 లక్షల (సుమారు £20,000)కు కొనుగోలు చేశారు. కారు ఇంటికి వచ్చాక మొదటిదైన ఆనందం కనిపించినా, క్రమంగా కొన్ని అనుమానాలు ఈవాన్ మదిలో మొదలయ్యాయి. కారులో ఉన్న పాత వస్తువులు — టెంట్ మేకు, క్రిస్మస్ చెట్టు ఆకులు, చాక్లెట్ రేపర్లు — అతడికి చాలా పరిచయంగా అనిపించాయి. ఇవన్నీ గతంలో తన కారులో వదిలిపెట్టినవే అని గుర్తుకు వచ్చాయి.
అసలు నిజం వెలుగులోకి
ఈ అనుమానంతో కారులోని శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ హిస్టరీని చెక్ చేసిన ఈవాన్, అక్కడ తన పాత చిరునామాలు, ప్రయాణ మార్గాలు కనిపించటంతో షాక్‌కు గురయ్యారు. నిజం నిస్సందేహంగా బహిర్గతమైంది తాను కొత్తగా కొనుక్కున్నది అసలు కొత్త కారు కాదు, తాను పోగొట్టుకున్న అదే కారు ఈవాన్ తెలిపిన ప్రకారం, ఆ సమయంలో నా చేతులు వణికిపోయాయి, గుండె వేగంగా కొట్టుకుంది. నేను ఆ కారు నడిపిస్తూ ఉండగానే దాదాపు క్రాష్ చేసేవరకు షాక్ అయ్యాను. ఒకవైపు మళ్లీ నా కారును తిరిగి పొందిన ఆనందం, మరోవైపు దొంగల చేతిలో మోసపోయిన బాధ మిశ్రమ భావోద్వేగాలను కలిగించాయి. దొంగలు కారు నంబర్ ప్లేట్‌ను మార్చి, మైలేజీని ఫేక్ చేసి, అసలైన వివరాలు దాచిపెట్టి దానిని రీసెల్ చేయడంతో తన కారును గుర్తించలేకపోయానని ఈవాన్ పేర్కొన్నారు.
Read also: DGCA : పాక్ గగనతలం మూసివేత.. విమానయాన సంస్థలకు డీజీసీఏ అడ్వైజరీ జారీ