అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే.
నిన్నమొన్నటి వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్-మస్క్ మధ్య నెలకొన్న ఈ వైరం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. దీనిపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ (Dmitry Medvedev) తాజాగా స్పందించారు.
శాంతి ఒప్పందం
ఇద్దరి మధ్య ‘శాంతి ఒప్పందం’ కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ప్రతిపాదించారు. అయితే, అందుకు తనకు ఫీజు కావాలని (Starlink Stock As Fee) వ్యాఖ్యానించారు. ‘D (డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశిస్తూ), E (ఎలాన్ మస్క్) మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అందుకు కొంచెం ఫీజు తీసుకుంటాం. స్టార్‌లింక్ షేర్లను ఆ ఫీజుగా స్వీకరిస్తాం. మీరు కొట్టుకోవద్దు’ అంటూ మెద్వెదేవ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ పోస్ట్‌కు టెస్లా బాస్ స్పందించారు. టెస్లా షేర్లు అడిగినందుకు నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇచ్చారు.
Read Also:Mirza: భారత్ జెట్స్‌ను కూల్చేశాం.. షంషద్ మీర్జా