ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఫేక్ బాంబుల కలకలం పెరిగిపోతున్నాయి. విమానాల్లోను, స్కూళ్లలోను, ఇతర ఉన్నతాధికారుల ఇళ్లలోను, ప్రముఖుల ఇళ్లలోనూ ఈ బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. ప్రముఖ షాపింగ్ మాల్స్, సినిమా హాలు, ప్రార్థనాస్థలాలు ఇలా ఎక్కడైతే అధికంగా ప్రజలు కూడుకుంటున్నారో వాటినే పోకిరీలు టార్గెట్ గా చేసుకుంటున్నారు. ఇలా ఒక్క ఫేక్ ఈమెయిల్ ద్వారా ఎంత సమయం, డబ్బు వృధా అవుతుందో గ్రహించడం లేదు. ఇలాంటి అసత్యవార్తలపై వారికి లభించే ఆనందం ఏంటో తెలియదు. కానీ ఏవిధంగానై పోలీసులకు దొరికిపోతారు అనే స్పృహ ఉంటే ఇలాంటి పోకిరిచేష్టలు చేయరు. తాజాగా అంతర్జాతీయస్థాయిలో అత్యంత కఠినమైన భద్రతా నిబంధనలు ఉండే సింగపూర్ లో ఓ చర్చికి వచ్చిన బాంబు బెదిరింపు స్థానికంగా తీవ్ర భయందోళనలు రేకెత్తించింది. అచ్చం బాంబును పోలి ఉన్న వస్తువులను చర్చిలో ఉంచి భక్తులను భయభ్రాంతులకు గురిచేసిన ఘటనలో భారత సంతతికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ బాంబు బెదిరింపు స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. అచ్చం బాంబును పోలి ఉన్న వస్తువులను చర్చిలో ఉంచి భక్తులను భయభ్రాంతులకు గురిచేసిన ఘటనలో భారత సంతతికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నకిలీ బాంబు బెదిరింపు కారణంగా చర్చిలో జరగాల్సిన ఆదివారం ప్రార్థనలు అన్నీ రద్దు అయ్యాయి.
Read also: Jakarta: ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం
అవన్నీ నకిలీ బాంబులే..
సింగపూర్ లోని అపర్ బుకిట్ టిమా ప్రాంతంలో ఉన్న ప్రముఖ సెయింట్ జోసెఫ్ చర్చికి ఆదివారం ఉదయం 7:11 గంటల సమయంలో ఒక అజ్ఞాత బెదిరింపు వచ్చింది. చర్చి ప్రాంగణంలో ఐఈడి తరహాలో ఉన్న మూడు అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో భక్తులు ఒక్కసారికిగా ఉలిక్కిపడ్డారు. కార్డ్ బోర్డ్ రోల్స్ లో రాళ్లు నింపి.. బయటకు ఎరుపువైర్లు కనిపిస్తున్న ఆ వస్తువులను నలుపు, పసుపురంగు టేపులతో చుట్టి అత్యంత ప్రమాదకరమైన బాంబులా కనిపించేలా అమర్చారు. దీంతో చర్చి నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిపిన వెంటనే భద్రతా దళాలు, బాంబు డిస్పోజల్ చర్చికి చేరుకున్నాయి. చర్చి పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ఆ అనుమానాస్పద వస్తువులను పరీక్షించారు. సుదీర్ఘ తనిఖీ అనంతరం అవి కేవలం నలికీ బాంబులని తేల్చారు. అయితే భద్రతాకారణాల వల్ల ఆదివారం జరగాల్సిన అన్ని మతపరమైన కార్యక్రమాలను అధికారులు రద్దు చేశారు. అయితే ఈ బాంబు బెదిరింపులకు పాల్పడింది భారత సంతతికి చెందిన సింగపూర్ పౌరుడు కోకుల్ నాథ్ మోహన్(49) గా పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: