2026 అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లిని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. అమెరికాలోని భారతీయుల మధ్య సంస్కృతి, సేవలను ప్రోత్సహించే FIA, న్యూయార్క్‌లో ఘనంగా జరిగే ‘ఇండియా డే పరేడ్’ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. శ్రీకాంత్ అక్కపల్లి FIAలో పదవి చేపట్టిన తొలి తెలుగు నాయకుడు. వృత్తిరీత్యా వ్యాపారవేత్త శ్రీకాంత్, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, మీడియా రంగాల్లో అనుభవం గల వ్యక్తి. FIAలో చేరేముందు అనేక కమ్యూనిటీ సంస్థల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. 2025లో కన్వీనర్, రిసెప్షన్ ఛైర్‌గా పనిచేసి, నిబద్ధతను చూపడం ద్వారా ఆయనకు FIA అధ్యక్ష పదవికి మార్గం సిద్దమైంది.
Read also: CEC: ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ ఎన్నికలు
Srikant Akkapalli
FIA సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు
అధ్యక్షుడిగా పదవి స్వీకరిస్తూ శ్రీకాంత్ అక్కపల్లి FIA సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని, భారతీయ సమాజంలో సంబంధాలను పెంచడానికి కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. ఆయన నిజాయితీ, కృషి, కమ్యూనిటీ సేవలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: