Telugu News: Sri Lanka: దిత్వా తుఫాను బీభత్సంతో శ్రీలంక అతలాకుతలం.. 56 మంది మృతి

Read Time:  1 min
Sri Lanka
Sri Lanka
FONT SIZE
GET APP

శ్రీలంకలో (Sri Lanka) ప్రకృతి విలయతాండం చేస్తున్నది. దిత్వా తుఫాను బీభత్సంతో శ్రీలంక చిగురుటాకులా వణికిపోతున్నది. భారీ వర్షాలతో (Heavy rains) కొండచరియలు విరిగిపడుతున్నాయి. రోడ్లన్నీ వరదనీటితో మునిగిపోతున్నాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజల జీవనం అస్తవ్యస్థంగా మారింది. ఇంకోవైపు కొండచరియలు విరిగిపడటంతో ఆస్తి, ప్రాణ నష్టం బాగా జరిగింది. వరదలు కారణంగా ఇప్పటివరకు 56మంది చనిపోయారు. మరోవైపు కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. దేశవాప్తంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 56కు చేరుకుందని.. 21 మంది ఆచూకీ గల్లంతైందని 600కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు శుక్రవారం తెలిపారు.

Read also : Putin Ukraine war : యుక్రెయిన్ వెనక్కి తగ్గితే యుద్ధం ఆపుతాం: ఒక్క షరతుతో పుతిన్ ప్రకటన…

Sri Lanka
Sri Lanka Cyclone Ditva wreaks havoc in Sri Lanka, 56 dead

గురువారం నుంచి భారీ వర్షాలు కురవడంతో ఇళ్లు, పొలాలు, రోడ్లు నీట మునిగినట్లుగా వెల్లడించారు. ఇక 12,000 కుటుంబాలకు చెందిన 44,000 మంది ప్రజలు వరద బారిన పడ్డారు. ఇళ్లు ధ్వంసం కావడంతో పాటు రవాణా వ్యవస్థలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం, ఆహారం, తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సహాయం కోసం వేచిచూస్తున్నారు.

రానున్న రోజుల్లో మరింత వర్షాలు

గత 24 గంటల్లో వవునియాలోని చెడ్డికులంలో 315 మి.మీ, ముత్తెతీవులో అలపల్లిలో 305 మి.మీ, అనేక జిల్లాల్లో 200 మి.మీ వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గలంతైన వారికోసం అన్వేషణ కొనసాగుతున్నది. ఇక వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.