📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Sports – రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ వికెట్ కీపర్

Author Icon By Anusha
Updated: September 22, 2025 • 6:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణాఫ్రికా క్రికెట్ అభిమానుల కోసం ఒక అద్భుతమైన శుభవార్త వచ్చింది. గతంలో తన వన్డే కెరీర్‌కి వీడ్కోలు పలికిన స్టార్ వికెట్ కీపర్–బ్యాటర్ క్వింటన్ డికాక్ (Quinton DeKock), ఇప్పుడు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని తిరిగి తీసుకుని మళ్లీ జట్టులోకి చేరనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో పెద్ద ఆశ్చర్యాన్ని సృష్టించింది. ఇటీవలే ప్రకటించిన జట్లలో డికాక్ వన్డే,టీ20 రెండూ ఫార్మాట్లలో చోటు పొందారు. ముఖ్యంగా త్వరలో జరగనున్న పాకిస్థాన్ పర్యటనకు అతను సిద్ధమవుతున్నాడు.2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ అనంతరం డికాక్ 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి అతను కేవలం టీ20 ఫార్మాట్‌ (T20 format) లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే, 2027లో తమ స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతను తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ టూర్‌కు ముందు నమీబియాతో జరిగే ఏకైక టీ20 మ్యాచ్‌లో కూడా డికాక్ ఆడనున్నాడు.

అతని నైపుణ్యం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది

డికాక్ పునరాగమనంపై దక్షిణాఫ్రికా కోచ్ కాన్రాడ్ హర్షం వ్యక్తం చేశారు. “క్వింటన్ మళ్లీ వైట్-బాల్ క్రికెట్ ఆడటానికి ముందుకు రావడం మాకు చాలా పెద్ద బూస్ట్. అతని భవిష్యత్ ప్రణాళికల (Future plans) గురించి గత నెలలో మేం చర్చించాం. దేశం తరఫున ఆడాలనే బలమైన ఆకాంక్ష అతనిలో ఇంకా ఉందని అప్పుడే స్పష్టమైంది.

Sports

అతని నైపుణ్యం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది” అని కాన్రాడ్ (Conrad) వివరించారు.నిజానికి, రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలోనే డికాక్ భవిష్యత్తులో తిరిగి వచ్చే అవకాశం ఉందనే పరోక్ష సంకేతాలిచ్చాడు.”ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదు. కానీ జీవితంలో విచిత్రమైనవి జరుగుతుంటాయి. భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చు” అని అతను అప్పట్లో వ్యాఖ్యానించాడు. ఇప్పుడు అదే నిజమైంది.

అతని రాకతో 2026 టీ20 ప్రపంచకప్, 2027 వన్డే ప్రపంచకప్‌లకు దక్షిణాఫ్రికా జట్టు మరింత పటిష్టంగా మారనుంది.దక్షిణాఫ్రికా (South Africa) తరఫున 155 వన్డేలు ఆడిన డికాక్, 45.74 సగటుతో 6,770 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా, 92 టీ20 మ్యాచ్‌లలో 138కి పైగా స్ట్రైక్ రేట్‌తో 2,584 పరుగులు చేశాడు. అతని అనుభవం, దూకుడైన బ్యాటింగ్ రాబోయే టోర్నమెంట్లలో జట్టుకు కీలకం కానున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/abhishek-sharma-former-pakistani-cricketer-praises-abhishek-sharma/sports/552186/

2027 World Cup batter Comeback latest news ODI team Pakistan tour Quinton de Kock reaking News retirement reversal South Africa Star T20 team Telugu News WicketKeeper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.