Spider: థాయ్‌లాండ్‌లో శాస్త్రవేత్తలు ఒక అరుదైన సాలీడును గుర్తించారు. ఈ సాలీడు (spider) ప్రత్యేకత ఏమిటంటే ఇందులో మగ మరియు ఆడ లక్షణాలు రెండూ ఉన్నాయి. శరీరంపై రెండు వేర్వేరు రంగులు స్పష్టంగా కనిపించాయి. ఒకవైపు నారింజ రంగుతో ఆడ లక్షణాలు, మరొకవైపు బూడిద వర్ణంలో మగ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం, ఈ సాలీడును “డెమార్చస్ ఇనాజుమా” అనే జాతికి చెందినదిగా గుర్తించారు. థాయ్‌లాండ్‌లోని నాంగ్ రోంగ్ సమీప అటవీ ప్రాంతంలో పరిశోధకులు వేటగాళ్ల కోసం తవ్వుతుండగా ఈ అరుదైన జీవిని కనుగొన్నారు.
Read also: Manhattan: న్యూయార్క్ లోని గూగుల్ ఆఫీస్ క్లోజ్ ఎందుకంటే ?
Spider: థాయ్ లాండ్ లో కొత్తరకం సాలీడు గుర్తించిన శాస్త్రవేత్తలు
గైనండ్రోమోర్ఫిజం అని
Spider: ఈ రకమైన జీవరూపంలో మగ మరియు ఆడ లక్షణాలు ఒకేసారి ఉండడాన్ని శాస్త్రీయంగా “గైనండ్రోమోర్ఫిజం” (Gynandromorphism) అని అంటారు. ఇది చాలా అరుదైన జీవవికాస ఫీనామెనాగా పరిగణించబడుతుంది. సాధారణంగా ఈ పరిస్థితి కణ విభజనలో జరిగే జన్యు మార్పుల వల్ల ఏర్పడుతుంది. “జూటాక్సా” అనే శాస్త్రీయ జర్నల్‌లో ఈ సాలీడుకు సంబంధించిన పరిశోధన పత్రం ప్రచురించబడింది. అందులో ఈ సాలీడు శరీరం పూర్తిగా సమతుల్యంగా విభజించబడినట్లు పేర్కొన్నారు. ఎడమ భాగం ఆడ లక్షణాలను, కుడి భాగం మగ లక్షణాలను కలిగి ఉందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: