ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
అంతరిక్ష రంగంలో క్రమంగా పురోగతి సాధిస్తున్న ఆయనకు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రయోగాలు వరుసగా విఫలమవుతున్నాయి. తాజాగా స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ (SpaceX Starship) మరోసారి పేలింది.
10వ విమాన పరీక్ష
టెక్సాస్‌లోని ఎలాన్ మస్క్‌కు చెందిన పరీక్ష కేంద్రం వద్ద బుధవారం రొటీన్ స్టాటిక్ ఫైర్ టెస్ట్ నిర్వహించారు. ఈ క్రమంలో అది ఉన్నట్టుండి పేలిపోయింది. ఈ విషయాన్ని స్పేస్‌ఎక్స్ ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇది జరిగిందని పేర్కొంది. స్టార్‌షిప్ 10వ విమాన పరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని, అధికారులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
గత నెల (మే 27) న జరిగిన 9వ టెస్ట్ కూడా re‑entry సమయంలో fuel leak కారణంగా తగలబోయింది—మరో మూడు ఫెయిల్యూర్‌లలో ఇది ఒకటి .
Read Also:White House: ట్రంప్-పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చట్టాపట్టాలు