📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

South Korea: ప్రేమలో పడితే డబ్బు, పెళ్లి చేసుకుంటే లక్షలు.. బంపర్ ఆఫర్

Author Icon By Tejaswini Y
Updated: December 25, 2025 • 11:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

South Korea Population: పెళ్లి చేసుకోవాలని, పిల్లలను కనాలని ప్రభుత్వమే ప్రోత్సహిస్తే ఎలా ఉంటుంది? డేటింగ్‌కు వెళ్లినా నగదు ఇస్తే? వివాహం చేసుకుంటే లక్షల్లో ఆర్థిక సాయం అందిస్తే? ఇది కల కాదు, వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు ప్రమాదకరంగా పడిపోతుండటంతో పలువురు దేశాలు యువతను పెళ్లి, కుటుంబ జీవనం వైపు ఆకర్షించేందుకు వినూత్న పథకాలను అమలు చేస్తున్నాయి.

Read also: Earthquake: తైవాన్‌లో భూకంపం: ప్రజల్లో భయాందోళన

ఈ విషయంలో దక్షిణ కొరియా(South Korea) ముందంజలో ఉంది. అక్కడి యువత వివాహం, సంతానం విషయంలో ఆసక్తి చూపకపోవడంతో జనన రేటు అత్యంత కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం డేటింగ్ నుంచి వివాహం, పిల్లల జననం వరకు ప్రతి దశలో భారీ ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తోంది.

దక్షిణ కొరియాలోని బుసాన్ వంటి నగరాల్లో యువకులు, యువత కలిసి డేటింగ్‌ (Dating Incentives)కు వెళ్లాలని నిర్ణయిస్తే ప్రభుత్వమే ఖర్చుల కోసం సుమారు రూ.30 వేల నుంచి రూ.31 వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని కలిసి భోజనం చేయడం, సినిమా చూడటం లేదా విహారయాత్రలకు వినియోగించుకోవచ్చు. ఒంటరిగా జీవించే యువతను సామాజిక సంబంధాల వైపు మళ్లించడమే ఈ పథకం లక్ష్యం.

ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, పిల్లలు కనండి..

డేటింగ్ దశను దాటి వివాహాని(Marriage Incentives)కి సిద్ధమైతే మరింత భారీ ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. పెళ్లి ఖర్చులు, నివాస అవసరాల కోసం ఒక్కో జంటకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు నగదు సహాయం అందిస్తున్నారు. వివాహానికి ముందు ఇరు కుటుంబాల సమావేశాలకు అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తోంది.

ఈ ప్రోత్సాహకాలకు కారణం తీవ్ర జనాభా సంక్షోభం. దక్షిణ కొరియాలో జనన రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా 0.72కి పడిపోయింది. పెరిగిన ఉద్యోగ ఒత్తిడి, అధిక జీవన వ్యయం, ఆర్థిక భద్రతపై అనిశ్చితి కారణంగా యువత వివాహాలకు దూరమవుతున్నారు. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందనే భయంతో ప్రభుత్వం ఈ పథకాలను యుద్ధప్రాతిపదికన అమలు చేస్తోంది. ప్రస్తుతం ఇవి కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులుగా అమలవుతున్నాయి.

ఇదే తరహాలో జపాన్, చైనా, ఇటలీ, రష్యా, హంగేరీ వంటి దేశాలు కూడా జనాభా తగ్గుదలను అరికట్టేందుకు వివిధ రకాల కుటుంబ ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తున్నాయి.

భారతదేశంలో కూడా జనాభా ధోరణిపై చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఇటీవల జనాభా వృద్ధి తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఎక్కువ మంది పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ఆలోచన ఉందని వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గితే భవిష్యత్తులో రాజకీయ, ఆర్థిక ప్రాధాన్యం తగ్గే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశ జనాభా 140 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, పెళ్లిళ్ల సంఖ్య తగ్గుతూ ఉండటం, జీవనశైలి మార్పులు, సంతాన సమస్యలు భవిష్యత్తులో భారతదేశాన్నీ ఇదే సంక్షోభం వైపు నడిపించవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Birth Rate Decline Dating Incentives Global Population Decline Government Schemes Marriage Incentives South Korea Population Crisis Youth Marriage Programs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.