ఆఫ్రికా దేశం ఇథియోపియాలోని హేలీ గుబ్బి ఆగ్నిపర్వతంలో ఆదివారం జరిగిన విస్పోటనం కలకలం రేపింది. దాని నుంచి వెలువడిన ప్రమాదకర బూడిదతో ఏర్పడిన మేఘాలు భారత్ లోని వాయవ్య, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల వైపుగా వస్తున్నాయంటూ అలర్ట్ వచ్చింది. తొలుత భారత్ లోని వాయవ్య ప్రాంతంలోకి ప్రవేశించిన ఈ మేఘాలు, చివరకు చైనా దిశగా రూటును మార్చుకున్నాయి. దీంతో ఇంకొన్ని రోజులపాటు మనదేశంలో విమాన సర్వీసులు ప్రభావితం అవుతాయనే ఆందోళనలు తప్పాయి.
Read Also: India vs South Africa:రెండో టెస్టు ఒత్తిడిలో భరత్
ఆ బూడిద మేఘాలు పసిఫిక్ మహాసముద్రంతో పాటు ఎగువ వాతావరణంలోని గాలుల్లో (సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్) కలిసిపోతాయని నిపుణులు వెల్లడించారు. దీనివల్ల ఎవరికీ ఎలాంటి రిస్క్ ఉండదని తేల్చి చెప్పారు. అగ్నిపర్వత బూడిద మేఘాల ప్రభావంతో, అవి కదలాడే పరిసర ప్రాంతాల్లో సూర్యాస్తమయం, సూర్యోదయం అంత కలర్ ఫుల్ గా ఉండకపోవచ్చన్నారు. ఈ బూడిద మేఘాల్లో ప్రమాదకర సల్ఫర్ డయాక్సైడ్ ఉంది. ప్రస్తుతం భూమి వాతావరణానికి 40వేల అడుగుల ఎత్తులో ఇవి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేఘంలోని సల్ఫర్ డయాక్సైడ్ అణువులు క్రమంలో ఎగువ వాతావరణంలో చెల్లాచెదురుగా కలిసిపోతాయని నిపుణులు స్పష్టం చేశారు.
విమానాల్లో కొనసాగుతున్న తనిఖీలు
అగ్నిపర్వత బూడిద మేథాల కదలిక నేపథ్యంలో మేం అప్రమత్తంగా ఉన్నామని ఎయిర్ ఇండియా (Air India) తెలిపింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హేలీ గుబ్బి అగ్నిపర్వత ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించిన విమానాల్లో భద్రత తనిఖీలు చేయిస్తున్నామని, విమాన
సర్వీసుల వేళలపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్ లు పంపుతున్నామన్నారు. సర్వీసులు రద్దయిన చోట్ల ప్రయాణికుల బస కోసం హోటల్ వసతిని కల్పిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ఎయిర్ ఇండియా ట్విట్ చేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: