📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Sourav Ganguly: టాపార్డర్ వైఫల్యంతోనే టీమిండియా ఓడింది

Author Icon By Anusha
Updated: July 16, 2025 • 1:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా ఓటమిపాలైందని

భారత్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓడిపోవడంపై మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘స్పోర్ట్స్ టుడే’ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ, టాపార్డర్ వైఫల్యంతోనే ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో టీమిండియా ఓటమిపాలైందని మాజీ కెప్టెన్ సౌరవ్ గూంగూలీ అన్నాడు. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అద్భుత ప్రదర్శన కనబర్చినప్పుడు టాపార్డర్‌కు ఏమైందని ప్రశ్నించాడు. ఒక్క బ్యాటర్ మెరుగ్గా రాణించినా ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. భారత బ్యాటర్ల వైఫల్యం తీవ్ర నిరాశకు గురి చేసిందని అసహనం వ్యక్తం చేశాడు.ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఓడినా బాధగా లేదని పోస్ట్‌లు

టెయిలెండర్స్ సాయంతో ఆఖరి వరకు రవీంద్ర జడేజా చేసిన పోరాటం వృథా అయ్యింది. ఓ దశలో భారత్ గెలిచేలా కనిపించింది. కానీ హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ చివరి వికెట్‌గా వెనుదిరగడంతో భారత ఓటమి లాంఛనమైంది. షోయబ్ బషీర్ (Shoaib Bashir) వేసిన బంతి సిరాజ్ బాగానే డిఫెన్స్ చేసినా, నెమ్మదిగా వెళ్లి వికెట్లను తాకింది. దాంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినా రవీంద్ర జడేజా పోరాటం ఆకట్టుకుంది. దాంతో అందరూ అతనిపై ప్రశంసల జల్లు కురిపించారు. టీమిండియా ఓడినా బాధగా లేదని పోస్ట్‌లు పెట్టారు. అయితే జడేజా పోరాటం బాగానే ఉన్నా, టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లకు ఏమైందని సౌరవ్ గంగూలీ ప్రశ్నించాడు.భారత ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సిరీస్‌లో భారత్ బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే, ఈ 193 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధించాల్సింది.

Sourav Ganguly: టాపార్డర్ వైఫల్యంతోనే టీమిండియా ఓడింది

అసాధారణ ప్రదర్శన

జడేజా ఒంటరి పోరాటం చూసి భారత బ్యాటర్లు కచ్చితంగా నిరాశకు గురై ఉంటారు. ఎందుకంటే ఈ సిరీస్‌లో 2-1తో ఇంగ్లండ్‌పై ఆధిక్యం సాధించేందుకు ఇదో సువర్ణవకాశం. ముఖ్యంగా తమ సామర్థ్యానికి తగ్గట్లు ఆడలేదనే విషయాన్ని గ్రహించి భారత ఆటగాళ్లు మరింత బాధపడి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. టాపార్డర్ (taporder), బ్యాటర్లలో ఒక్కరు రాణించినా ఈ మ్యాచ్‌‌లో భారత్ గెలిచేది.జడేజా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. అతను ఇలా బ్యాటింగ్ చేస్తున్నంత కాలం తన కెరీర్‌ను కొనసాగిస్తాడు. అతను చాలా కాలంగా జట్టులో ఉన్నాడు. దాదాపు 80 టెస్ట్‌లు, 200కి పైగా వన్డేలు ఆడాడు. అతని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జడేజా ఒక ప్రత్యేకమైన ఆటగాడు. గత కొన్నేళ్లుగా అతని బ్యాటింగ్ ఎంతో మెరుగైంది. 

రెండో ఇన్నింగ్స్‌లో

ఎంతో అనుభవం కలిగిన జడేజా జట్టులో కీలకంగా మారాడు.’అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. 193 పరుగుల లక్ష్యచేధనకు దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా(61 నాటౌట్), కేఎల్ రాహుల్ (KL Rahul), (39) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. నాలుగో టెస్ట్‌ మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానుంది.

సౌరవ్ గంగూలీ వరల్డ్ రికార్డ్ ఏది?

వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు (183) చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు సృష్టించాడు. 2002లో, విజ్డెన్ క్రికెటర్స్ అల్మానాక్ అతన్ని అన్ని కాలాలలోనూ ఆరవ గొప్ప వన్డే బ్యాట్స్‌మన్‌గా పేర్కొంది.

సౌరవ్ గంగూలీ కి మరో పేరు ఏమిటి?

క్రికెట్ ప్రపంచంలో విస్తృతంగా ప్రసిద్ధి చెందిన సౌరవ్ గంగూలీ, బెంగాలీలో “అన్నయ్య” అని అర్థం వచ్చే ” దాదా ” అనే మారుపేరును సంపాదించుకున్నాడు. అతని ప్రవర్తన, నాయకత్వ లక్షణాలు, మైదానంలో, వెలుపల అతని వెచ్చని వ్యక్తిత్వం అభిమానులు,సహచరులలో ఈ మారుపేరు ప్రసిద్ధి చెందాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Jos Butler: వాషింగ్టన్ సుందర్ వల్లే టీమిండియా ఓడిపోయింది?

Anderson-Sachin Trophy Breaking News IND vs ENG Test series India top order failure India vs England 3rd Test latest news Lord’s Test 2025 Ravindra Jadeja performance Sourav Ganguly reaction Team India loss

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.