📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Sofia Qureshi: సరిహద్దుల వైపు చొచ్చుకొని వస్తున్న పాక్ ఆర్మీ

Author Icon By Sharanya
Updated: May 10, 2025 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత రక్షణ శాఖ అధికారులు మీడియా ముందుకు వచ్చి పాక్ చర్యలను ఖండిస్తూ కీలక ప్రకటనలు చేశారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంపై శనివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో, పాక్ యుద్ధ చర్యలపై, ఆ దేశం చేస్తున్న అప్రచారంపై, భారత సైన్యం ఇచ్చిన ప్రతిస్పందనపై వివరాలు వెల్లడించాయి.

సమావేశంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ, భారత సైన్యం ప్రతినిధి కల్నల్ సోఫియా ఖురేషీ, వాయుసేన ప్రతినిధి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. పాక్ వైపు నుంచి ప్రేరితమైన యుద్ధ ప్రకోపాలను ప్రపంచ సమాజానికి తెలియజేసే క్రమంలో ఈ సమావేశం నిర్వహించబడింది.

పాక్ అప్రచారం-భారత్ వివరణ

కల్నల్‌ సోఫియా ఖురేషీ మాట్లాడుతూ పాక్ సైన్యం భారత సరిహద్దుల వైపు కదులుతోందని చెప్పారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాక్ ఎలాంటి ప్రయత్నం చేయడంలేదని ఆరోపించారు. పాక్ బలగాలు సరిహద్దులవైపు కదలడం కచ్చితంగా ప్రమాదకరమైన చర్యేనని స్పష్టం చేశారు. పంజాబ్ లోని వాయుసేన స్థావరాలపై శనివారం తెల్లవారుజామున హైస్పీడ్ మిసైళ్లతో పాక్ దాడులు చేసిందని తెలిపారు. శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్ లలోని వైద్య కేంద్రాలపై దాడి చేసిందని చెప్పారు. ఇది ముమ్మాటికీ భారత్ ను రెచ్చగొట్టే చర్యేనని తెలిపారు. భారత మిలిటరీ స్థావరాలపై పాక్ చేస్తున్న దాడులను మన సైన్యం తిప్పికొట్టిందని వివరించారు.

భారత్ ప్రతిస్పందన:

ఈ దాడులకు తక్షణమే గట్టి ప్రతిస్పందనగా, భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్ మిలటరీ స్థావరాలు, రాడార్ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లపై ఆధునిక ఫైటర్ జెట్లతో గగనతల దాడులు చేసిందని ఖురేషీ వివరించారు. ఫైటర్‌ జెట్లతో అత్యంత కచ్చితంగా లక్ష్యాలు ఛేదించే ఆయుధాలు వాడి పస్రూర్‌లోని రాడార్‌ కేంద్రం, సియాల్‌ కోట్‌లోని ఏవియేషన్‌ బేస్‌ను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఇదే అంశాన్ని వ్యోమికా సింగ్‌ అంతర్జాతీయ మీడియా కోసం ఆంగ్లభాషలో వెల్లడించారు. భారత స్థావరాలు సురక్షితంగా ఉన్నాయని టైమ్‌ స్టాంప్‌లు ఉన్న వీడియోలు, ఫొటోలను మీడియా ముందు ప్రదర్శించారు. భారత వాయుసేన పూర్తి సమర్థతతో యుద్ధానికి సిద్ధంగా ఉందని, దేశ భద్రతలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు.

Read also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఇంటర్నెట్ నెటిజన్లకు కేంద్రం హెచ్చరిక

#bordersecurity #indianarmy #IndiaPakistanTensions #PakArmy #SofiaQureshi #SurgicalResponse #VikramMisri #VyomikaSingh Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Operation Sindoor Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.