📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

Trump H-1B: సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Author Icon By Vanipushpa
Updated: December 23, 2025 • 11:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హెచ్1బీ, హెచ్-4 వీసా(H-1B) దరఖాస్తుదారులకు అమెరికా చుక్కలు చూపిస్తోంది. దరఖాస్తు చేసుకున్న వాళ్లందరి సోషల్ మీడియా, ఆన్‌లైన్ యాక్టివిటీలను పరిశీలిస్తోన్న అమెరికా.. ఇప్పుడు దీన్ని అన్ని దేశాలకూ విస్తరింపజేసింది. ఇదివరకు కొన్ని దేశాలకే పరిమితమై ఉండేదీ విధానం.. తాజాగా అన్ని దేశాల నుంచి అదే హెచ్ 1బీ, హెచ్ 4 వీసా దరఖాస్తులన్నింటికీ వర్తింపజేసినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. దీనిపై భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. దీనివల్ల ఎక్కవశాతం ప్రభావం భారత్ పైనే పడుతోంది. ప్రతి సంవత్సరం 70 శాతానికి పైగా హెచ్-1బీ వీసా దరఖాస్తులు దాఖలయ్యేది భారత్ నుంచే. దీని తర్వాత రెండో స్థానంలో చైనా ఉంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనుసరిస్తోన్న ఈ కఠిన విధానాల మధ్య తాజాగా అమలులోకి వచ్చిన ఈ మార్పు వందలాది భారతీయ పౌరులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Read Also: Tulsi Gabbard statement : యూరప్‌పై రష్యా దాడి అసాధ్యం, తుల్సీ గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు…

Trump

హెచ్-1బీ, ఎఫ్-1, జే-1 వంటి అనేక వీసా కేటగిరీలు

ఈ తనిఖీలను స్టేట్ డిపార్ట్‌మెంట్ అథెంటికేషన్ లో భాగమని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా హెచ్-1బీ, హెచ్-4 వీసాలకు దరఖాస్తు చేసుకునే అన్ని దేశాల పౌరులకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని ఆ శాఖ వెల్లడించింది. హెచ్-1బీ, హెచ్-4 వీసాల కోసం అన్ని దేశాల దరఖాస్తుదారులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఈ పరిశీలన జరుగుతోందని స్పష్టం చేసింది. విదేశీ నిపుణులను నియమించుకోవడానికి అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూనే.. హెచ్-1బీ ప్రోగ్రామ్ దుర్వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా నిబంధనలను కఠినతరం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా హోల్డర్లపై పర్యవేక్షణ తీవ్రతరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

డిసెంబర్‌లో తమ వర్క్ పర్మిట్‌లను పునరుద్ధరించుకోవడానికి భారత్ కు తిరిగి వచ్చిన వందలాది మంది హెచ్-1బీ వీసా హోల్డర్లు, అమెరికా కాన్సులర్ కార్యాలయాలు అపాయింట్‌మెంట్‌ల వద్ద పడిగాపులు పడుతున్నారు. వీటిని అకస్మాత్తుగా రద్దు చేయడం, రోజుల తరబడి కొత్త తేదీలను కేటాయించడంతో ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారు. కొత్త వీసా పరిశీలన విధానం కారణంగానే ఇంటర్వ్యూ అపాయింట్ మెంట్ తేదీలను సవరించాల్సి వచ్చింది. ఈ విధానంలో దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలు, వారి ఆన్‌లైన్ ఉనికిని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ జాప్యం ఉన్నప్పటికీ.. అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లు హెచ్-1బీ, హెచ్-4 దరఖాస్తులను స్వీకరించడం, ప్రాసెస్ చేయడం కొనసాగిస్తాయని స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

digital background checks immigration screening India policy impact National Security Measures social media verification Social vetting Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.