అగ్రరాజ్యం అమెరికా(America)పై ప్రకృతి పగబట్టింది. గత రెండు రోజులుగా అమెరికా తూర్పు, మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్న భారీ మంచు తుఫాను భీభత్సం సృష్టిస్తోంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మంగళవారం ఉదయం నాటికి వివిధ రాష్ట్రాల్లో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్కిటిక్ శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు పడిపోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నిన్న ఒక్కరోజే 12,000 విమాన సర్వీసులు రద్దు కాగా, నేడు మరో 4,000 విమానాలను రద్దు చేశారు. దీనితో ప్రయాణికులు విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also: New Delhi: భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
రోడ్ల మీద మంచు పేరుకుపోవడంతో వాహనాలు నడపడం కష్టంగా మారింది. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు కార్లు వదిలేసి నడుచుకుంటూ తమ పనులు చేసుకుంటూ కనిపించారు. అధిక వినియోగం కారణంగా చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
న్యూయార్క్‌లోని అల్బనీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు దగ్గర పార్క్ చేసిన కార్లపై మంచు ఇలా పేరుకుపోయి కనిపించింది. చలి తీవ్రత కారణంగా దేశవ్యాప్తంగా రెండు డజన్లమందికి పైగా చనిపోయినట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: